- మావోయిస్టు అగ్రనేత సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్ ఆంధ్ర -చతిస్గడ్ సరిహద్దుల్లోని రాజ్ నంద్ గావు కాంకేర్ ఆటవీప్రాంతంలో పోలీసులుజరిపిన ఎన్ కౌంటర్ లో మృతి..
- ఆత్మకూరుమండలం, వడ్ల రామాపురం గ్రామానికి చేరిన సుగులూరి చిన్నన్న మృత దేహం..
- 1990 దశకంలో నల్లమలలోని భవనాసిదళం కమాండర్ గా పనిచేస్తూ ప్రభుత్వ చర్చల అనంతరం దండకారణ్యంలోకి వెళ్లిన చిన్నన్న..
- భద్రతా దళాల చేతిలో నేలకొరిగిన మావోయిస్టు నేత చిన్నన్న మృతదేహానికి నివాళులు అర్పించిన పౌరహక్కులనేతలు,ప్రజాస్వామిక వాదులు,బంధుమిత్రులు..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ “కగార్ “పేరుతో కుంబింగ్ ప్రారంభించి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని పౌర హక్కుల సంఘం నేతలుమండిపడ్డారు.చత్తిస్ ఘడ్ రాష్టం రాజ్ నంద్ గావ్ జిల్లా, మదన్వాడ-కాంకర్ ఆటవీ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు సుగులూరి చిన్నన్న మూడు రోజులక్రితం మృతి చెందారు.
విప్లవ జోహార్లతో అంతిమ వీడ్కోలు
కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని శనివారం చిన్నన్న సొంత గ్రామమైన ఆత్మకూరు మండలం, వడ్ల రామాపురం గ్రామానికి తీసుకువచ్చారు. మావోయిస్టు అగ్రనేత చిన్నన్న మృతదేహానికి పౌర హక్కుల సంఘం నాయకులు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకులు, విప్లవ రచయితల సంఘం నాయకులు, ప్రజాస్వామ్య వాదులు విప్లవ జోహార్లతో అంతిమ వీడ్కోలు పలికారు.
బూటకపు ఎన్కౌంటర్లు
ఈ సందర్భంగా విరసం రాష్ట్ర అధ్యక్షులు పినాక పాణి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేయాలన్నా దుస్సంకల్పంతో బూటకపు ఎన్కౌంటర్లు చేసి శునకానందం పొందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామిక వాదులు గమనిస్తున్నారని ఈ ప్రభుత్వానికి చమర గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అమాయక ప్రజల మానప్రాణాలను దోచుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో రాజ్యం తీర్పునిస్తుందని ఆయన హెచ్చరించారు.
#mavoistChinnanna