“సొమ్ము” రెడ్డి సారధ్యంలో సర్వేపల్లిలో సహజవనరుల దోపిడీ
మహాకవి శ్రీశ్రీ అన్నట్లు “అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల..” కాదేది కవితకు అనర్హం అన్నట్లు, సోమిరెడ్డి వ్యవహారం కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా సాగుతుంది.
SPS నెల్లూరు జిల్లా:
తేది:23-12-2024
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామం నుండి రేయింబవళ్లు యదేచ్ఛగా ఇసుక, మట్టి తరలిస్తున్నారు
సోమిరెడ్డి ఆదేశాలతో మిన్నకుండిపోయిన పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు.
సోమిరెడ్డి ఇప్పటికే సర్వేపల్లిలో దొరికినంత గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిద అక్రమంగా త్రవ్వడం, తరలింపు చర్యలు చేపడుతూ, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా, చోద్యం చూస్తూ ఉండిపోయిన జిల్లా యంత్రాంగం.
సోమిరెడ్డి కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటూ, అక్రమ లేఔట్లను ప్రోత్సహించడం, ప్రభుత్వంతో సంబంధం లేకుండా మద్యం దుకాణాలు అనధికార బార్లు నిర్వహించడం, బెల్టు షాపులు నడపడం లాంటి అనైతిక, అక్రమ, అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు.
సోమిరెడ్డి అన్ని రంగాలలో పాల్పడుతున్న అవినీతి నెల్లూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కోడైకూస్తుంది.
కృష్ణపట్నం గ్రామం నుండి రేయింబవళ్లు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నా, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం, ఫోన్ చేసిన స్పందించకపోవడం దౌర్భాగ్యమంటున్న సర్వేపల్లి ప్రజలు.
కృష్ణపట్నం నుండి అక్రమ మట్టి, ఇసుక తరలింపును స్థానికులు అడ్డుకోవడంతో వారిపై దాడి చేసిన సోమిరెడ్డి మట్టి మాఫియా.
సోమిరెడ్డి మట్టి మాఫియా దాడి చేసి, ఇసుక, మట్టి అక్రమంగా తరలించుకొని పోతున్నారంటూ గ్రామస్తుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది.
సోమిరెడ్డికి ప్రతినిత్యం కోట్లాది రూపాయలు అక్రమ వసూళ్లు ఇంటికి చేరితే తప్ప, నిద్ర పట్టడం లేదంటూ, విమర్శలు గుప్పిస్తున్న సొంత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.
సోమిరెడ్డి చేస్తున్న అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరిపిస్తే, సోమిరెడ్డి జీవిత కాలం జైల్లో ఉన్న ఇంకా నేరాలు మిగిలిపోవడం ఖాయమంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు.
జిల్లా కలెక్టర్ గారైనా స్పందించి, సోమిరెడ్డి అవినీతి ఆధారాలు పరిశీలించి, అక్రమంగా మట్టి, ఇసుక తరలింపు పై చర్యలు చేపడతారేమో! వేచి చూద్దామంటున్న గ్రామస్తులు.