చిరుత పులుల సంచారం – దాడులు

Movement of leopards attacks

Movement of leopards attacks

నల్లమల అటవీ సమీప గ్రామలల్లో.. చిరుత పులుల భయం ..

వాటికవే దాడి చేయవు..

ముప్పుందని భావిస్తేనే మనుషులపైకి..

అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతల సంచారం సహజం..

కుక్కల కోసమే జనావాసాల్లోకి రాక..

అటవీ అధికారులకు సమాచారం ఇస్తే సురక్షితం..

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల సమీపంలో చిరుతల సంచారం పెరుగుతోంది. మహా నంది, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా చిరుతల సంచారంపై ఎక్కువ కావడంతో అటు భక్తులు, ఇటు స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

శిరువెళ్ల మండలం పచ్చర్ల వద్ద ఒక కూలిపై చిరుత దాడి చేసి గాయ పరచడం, మరో మహిళను చంపడం వంటి ఘటనలతో పరిస్థితి తీవ్రంగా మారింది. వాటిని బం ధించి తరలించాలనే ప్రజల ఒత్తిడి అటవీ అధికారు లపై అంతకంతకూ పెరుగుతోంది.

కుక్కల కోసమే..

సాధారణంగా చిరుతలు ఎక్కడైనా మనుగడ సాగించ గల పిల్లి జాతి జంతువులు. వీటికి దట్టమైన అడవులే అవసరం లేదు. అటవీ ప్రాంతాల్లో మేత కోసం గొర్రెల మందలను తీసుకెళ్లే సమయంలో వాటి వెంట నడిచే కుక్కల సవ్వడి చిరుతను ఆకర్షిస్తుంది.

దీంతో మందలను చిరుతలను అనుసరిస్తూ గ్రామాల్లోకి గాని, గొర్రెల మందలు నిలిపే పెంటల వద్దకు గానీ చిరుతలు చేరుకుంటాయి. అదును చూసి అక్కడ ఉం డే కుక్కలను ఎత్తుకు పోతుంటాయి. అప్పుడప్పుడూ గొర్రెలపై కూడా దాడులు చేస్తుంటాయి.

Also Read అత్తగారింటికి వెళ్ళడానికి RTC బస్సు చోరీ

అలాగే మహానంది, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు కీలకమైన నాగార్జున సాగర్-శ్రీశైలం పెద్దపులుల అభ యారణ్యంలో ఉండడంతో సహజంగా.. చిరుతలు జనావాసాల సమీపంలో తిరుగాడడం సహజమైన అంశమే. అన్నదాన సత్రాలు, హాస్టళ్ల వంటి చోట మిగిలిపోయే ఆహార వ్యర్థాలను బయట పారేస్తూ ఉంటారు.

అక్కడకు కుక్కలు గుంపులుగా చేరుతుం టాయి. అవి చిరుతలకు అందుబాటులో ఉన్న ఆహా రంగా మారతాయి. చిరుతలు అత్యంత సహజంగా కుక్కలను ఎత్తుకు పోయి ఆహారంగా తీసుకుంటుం టాయి. చిరుతలు, అడవి పందులను తరుముతూ..

కూడా శ్రీశైలం క్షేత్రంలో ఒకవైపు నుంచి మరోవైపు నకు వెళ్తుంటాయి. ఆ సమయంలో ఎవరో ఒకరు. చిరుతలను చూడటం భయభ్రాంతులకు గురై గగ్గోలు పెడుతుంటారు.

ఇవి మరుసటి రోజు వార్తాంశంగా. మారి మొత్తం రాష్ట్రంలోని ఓ రకమైన చిరుత ఫోబి యాను విస్తరిస్తుంటుంది.

  • ప్రత్యేక పరిస్థితుల్లోనే మనుషులపై దాడి

సాధారణంగా చిరుతలు ఆహారం కోసం మనుషు లపై దాడులు చేయవు. రెండు కాళ్లపై సంచరించే ఏ జంతువు (మనిషి) చిరుతలకు ఆహారం కాదు.

చిరుతలు మనుషులకు కనిపించకుండానే సంచరిం చేందుకు ప్రయత్నిస్తుంటాయి. అటవీ ప్రాంతాల్లో పిల్లలతో సంచరించేటప్పుడు పెద్దవారు తగు జాగ్ర త్తలతో ఉండాలి,

అటవీ ప్రాంతాల్లో ఒంగి పని చేయడమో, ఆహారం తినేందుకు కింద కూర్చోవడమో చేయడం ద్వారా చిరుతలకు మను మలు ఆహార జం తువులుగా అనిపిస్తారు.

చిరుత దాడిలో ఓ మహిళ మృతి

ఈ సమయంలోనే ఎక్కువ దాడులు జరుగుతుంటాయి. రైల్యే పనులకు వచ్చిన ఒక మహిళ కూర్చొని భోజనం చేస్తుండగానే చిరుత దాడికి గురైంది. మరో మహిళ అడవిలో వంట చెరుకు కోసం వంగి పని చేస్తుండగానే చిరుత దాడి చేసింది.

చిరుతల నుంచి ఎలా రక్షించుకోవాలంటే..

  • అటవీ ప్రాంతాల్లో సంచిరించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కిం ద కూర్చోవడం కాని, ఒంగి నడవడం కానీ చేయరాదు.
  • శ్రీశైలం ఘాట్ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు అత్య వసర పరిస్థితుల్లో తప్ప వాహనాలను అడవిలో నిలపరాదు. అలాగే చిరుతిళ్లు, అల్పాహారం తినడానికి అడవిలో వాహనాలు నిలుపరాదు.
  • అడవుల్లో సంచరించే వారు చేతిలో ఒక పట్టుడుకర్రలాంటిది చేతిలో ఉంచుకో వాలి. ఆ కర్ర మ నిషి ఆకారాన్ని పెద్దదిగా చేసి చూపడం వల్ల చిరుతల్లాంటి వన్యప్రాణులు భయపడి దగ్గరకు రావు.
  • శ్రీశైలం, మహానంది లాంటి పుణ్యక్షేత్రాల్లో ఆహార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయ కుండా శ్రద్ద వహించాలి.
  • రాత్రిళ్లు బయట తిరగకుండా ఉండడం మంచిది.కాకపోతే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమా దాలను అధిగమించవచ్చు.

చిరుత లను బంధించడం పరిష్కారం కాదు

చిరుత దాడులు, సంచారం ఎక్కువైనప్పుడు ప్రజల నుంచి వాటిని బోనులో బంధించి మరో చోటుకు తర లించాలన్న డిమాండ్ పెరుగుతూ ఉంటుంది.

అధికా రులు కూడా ఈ ఒత్తిడితో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు పెట్టి వాటి ఉనికి కనిపెట్టి ఆ ప్రాంతంలో బోను పెట్టి బం ధిస్తుంటారు.

అయితే చిరుతలు కూడా పెద్ద పులిలాగే జీవన శైలిలో నిర్దేశిత(టెరిటరీ)ప్రాంతంలోనే తిరుగు తుంది. ఆ ప్రాంతానికి మరో చిరుతను రానివ్వవు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

ప్రజల డిమాండ్ మేరకు ఒక చిరుతను బంధించి వేరే ప్రాంతంలో వదిలి వేస్తే ఖాళీ అయిన టెరటరీలోకి మరో చిరుత వచ్చి చేరుతుంది.

ఎన్ని చిరుతలను బం ధించినా సరే మరో చిరుత రావడం ఖాయం. తిరుమ లలో మనకు ఈ విషయం స్పష్టమైంది.

కాబట్టి అటవీ సమీప జనావాసాల్లో జీవించే వారు వన్యప్రాణులతో సంఘర్షణ పడుతూ సహజీవనం చేయాల్సిందే..

చిరుత మనుషులపై దాడి చేయదుసాయిబాబా, డీడీ పీటీ, ఆత్మకూరు

ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప చిరుత సాధారణంగా మను షులపై దాడికి పూనుకోదు. చిరుత అడవుల్లోనే కాక, మైదాన ప్రాంతాలు, పట్టణ శివార్లలోనూ మనగలిగే వన్యప్రాణి. చిరుతకు కుక్క లపై మక్కువ ఎక్కువ. అందుకే వాటిని అనుస రిస్తూ గ్రామాల్లోకి, అటవీ సమీప జనావాసాల్లోకి వస్తుంటాయి. జనావాసాల్లో చిరుత కనిపిస్తే దాడి చేయొద్దు. వెంటనే సమీపంలోని అటవీ అధికారు లకు సమాచారమివ్వాలి. చిరుత లాంటి వన్యప్రాః ణులకు హాని కలిగిస్తే శిక్షార్హులవుతారు.

  • సాయిబాబా, డీడీ పీటీ, ఆత్మకూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top