- డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు..కుప్పకూలిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి పెన్సిల్వేని రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.
మొఖం మీద రక్తంతో కనిపించిన ట్రంప్ ను అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది హుటాహుటిన స్టేజి మీద నుంచి కిందికి తీసుకువచ్చి అంబులెన్స్ లోకి చేర్చారు.
ఆ సమయంలో ఆయన చెవి దగ్గర చెంపలపై రక్తం కారుతుండడం కనిపించింది ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నాడని రిపబ్లిక్ అండ్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనలో..కాల్పులు జరిపిన వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించారు.సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి దుండగుడి కాల్పుల్లో మరణించారని మరో ఇద్దరూ గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ప్రకటించింది.
పెన్సిల్వేనియాలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన ర్యాలీ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినిపించాయి.
వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ చుట్టూ రక్షణగా నిలిచారు అప్పటికే ఆయన చెవి దగ్గర చంపలమీద రక్తం కనిపించింది
కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ట్రంప్ ను స్టేజి మీద నుంచి కిందికి తీసుకువచ్చారు.సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్టేజి మీద నుంచి కిందికి దించుతుండగా
ట్రంప్తన పిడికిలి పైకెత్తి చూపుతూ వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్టుండి వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని సభకు వచ్చిన ప్రేక్షకుల్లోని ఒకరు చెప్పారు.
ట్రంప్ ను స్టేజి మిద నుండి దింపు తుండగా చూశానని అని ఒక్కసారిగా జనం అక్కడ గుమిగుడి అంత గందరగోళంగా కనిపించిందని మరో వ్యక్తి చెప్పారు.
కాల్పుల శబ్దం వినిపించడం ట్రంప్ గాయాలతో కనిపించడంతో సభకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.
- దాడిపై ట్రంప్ ప్రకటన విడుదల
దాడి తర్వాత ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో నా చెవి దగ్గర శబ్దం వినిపించింది. బుల్లెట్ నా చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్టు అనిపించింది. అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దేశంలో ఇలాంటి ఘటన జరుగుతుందని నేను ఊహించలేదు, కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో ఏంటో ఇంకా తెలియదు అతను ఇప్పుడు చనిపోయాడు అని పేర్కొన్నారు.
- దాడిని ఖండించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడం ఖండించారు పెన్సిల్వేనియాలో ట్రంప్ పై జరిగిన దాడి గురించి వివరాలు తెలుసుకున్నాను ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి కృతజ్ఞతలు, ఈ తరహా హింసకు అమెరికాలో చోటు లేదు దేశమంతా ఇలాంటి ఘటనలను ముక్తకంఠంతో ఖండించాలి అన్నారు.
దాడిపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారి
ట్రంప్ క్షేమంగా ఉండటంతో తాను ఊపిరి పీల్చుకున్నానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారి అన్నారు ఈ ఘటనలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నాం.
ఈ దేశంలో హింసకుతావు లేదు ఇలాంటి దుశ్చర్యలను అందరూ ఖండించాలి అని హారిస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- దాడిపై ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్
తన తండ్రిపై జరిగిన దాడిని దుండగుల తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.
దాడి పచ్చ తక్షణమే స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ డిపార్ట్మెంట్కు ఇతర అధికారులకు కృతజ్ఞతలు Also Read నల్లమలకు అడవి దున్న
నా దేశం కోసం నేను ప్రార్థిస్తూనే ఉంటాను ఐ లవ్ యు డాడ్ టుడే అండ్ ఆల్వేస్ అని పోస్ట్ లో రాశారు.
- దాడిని ఖండించిన భారత ప్రధాని నరేంద్రమోడి
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండించారు. నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు డంప్ పై దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఈ ఘటనను తీవ్రంగా నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై దాడి నన్ను తీవ్రంగా కలిసి వేసింది ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు
ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని రాశారు.
- దాడిపై రాహుల్ గాంధీ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనను ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం విచారకరమని ఇలాంటి ఘటనలను అందరూ ఖండించారని పోస్టులో రాశారు .ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు