సినిమా హత్యల్లో తెలంగాణా లో ఒక న్యాయం , ఆంధ్రప్రదేశ్ లో ఒకన్యాయమా !
మేడా శ్రీనివాస్ , తీవ్ర ఆగ్రహం ..
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..
తెలంగాణా లో జరిపిన సినిమా హత్యకు 2 కోట్లు ఒక ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో రెండు సినిమా హత్యలు లకు 10 లక్షలా దిల్ రాజ్ ఇది నీకు తగునా ! అని రాష్ట్రయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆక్షేపణ చేసారు …
హైదరాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద గల సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా కు వచ్చిన సినిమా హీరో అల్లు అర్జున్ ను చూడటానికి వచ్చిన తొక్కిసిలాట ఘటనలో తల్లి రేవతి చనిపోయారు. ఆఘటనలో బిడ్డ తేజ నేటికి కోలుకోలేని స్థితిలో వున్నారు . ఆ ఘటనలో పెద్దమనిషి పాత్ర పోషించిన సినీ నిర్మాత దిల్ రాజ్ అల్లు కుటుంబంతో ఒక కోటి , పుష్ప యూనిట్ నుండి ఒక కోటి దగ్గర వుండి ఇప్పించారు . మృతురాలు భర్త కు ఉద్యోగం సైతం ఇప్పించనున్నారు . చికిత్స పొందుతున్న తేజ వైద్య ఖర్చులు సైతం బరాయిస్తున్నట్టు ప్రకటించు కున్నారు . నిజానికి ఆ ఘటనలో అల్లు అర్జున్ అభిమానులను సంధ్య థియేటర్ వద్దకు రండి అని పిలుపు ఇచ్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవు .
రామ్ చరణ్ హీరోగా వస్తున్న “గేమ్ చేంజర్ ” సినిమా ప్రీ ఈవెంట్ ఫంక్షన్ రాజమండ్రి వేమగిరి ప్రాంతం వద్ద జరుగుతుంది మెగా అభిమానులు తరలి రండి అని సినిమా యూనిట్ నిర్వాహకులనుండి బారిగా పిలుపునిచ్చారు. అందుకు అవసరమగు అధికారిక సహాయ సహకారాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ , ఎస్పీ దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , మంత్రి వర్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారికంగా గేమ్ చేంజర్ ఈవెంట్ ను ప్రోత్సాహించారు .
ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఈ విధంగా అండ దండలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటి సారి అనుకుంటున్నాము . గేమ్ చేంజర్ సినిమా యూనిట్ పిలుపు మేరకు యువత బారిగా తరలి వచ్చారు . ఇద్దరు యువకుల అకాల మరణానికి కారకులయ్యారు . తెలంగాణాలో జరిగిన ఘటనకు మొత్తంగా రెండు కోట్లు, ఒక ఉద్యోగం, వైద్య ఖర్చులుకు బాధ్యత వహించిన దిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లో జరిగిన సినిమా హత్యలకు 10 లక్షలతో చేతులు దులుపు కోవటం తగునా ! దిల్ రాజ్ అని ఆయన హితవు పలికారు .
దిల్ రాజ్ వ్యవహరించటం
అల్లు కుటుంబాన్ని బెదిరించి మరి పెద్ద మొత్తంలో బారిగా నష్ట పరిహారం ఇప్పించిన దిల్ రాజ్ మెగా కుటుంబం పట్ల మెతక వైఖరితో బాధిత కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నట్టో దిల్ రాజ్ సమాధానం చెప్పాలి . అల్లు కుటుంబంకు ఒక న్యాయం. మెగా కుటుంబానికి మరో న్యాయంగా దిల్ రాజ్ వ్యవహరించటం పెద్ద మనిషి హోదాకు తగదు . బాధిత కుటుంబాలకు చెరో రెండు కోట్లు , వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చంద్రబాబు కూటమి సర్కార్ ను, నిర్మాత దిల్ రాజ్ ను , గేమ్ చేంజర్ సినిమా యూనిట్ ను అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు ..
— మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..