పంట కోత ప్రయోగం రైతులకు ఉపయోగం
పంట కోత ప్రయోగం రైతులకు ఉపయోగమని మండల వ్యవసాయ శాఖ అధికారి బి. నాగేశ్వరరెడ్డి అన్నారు.సోమవారం మహానంది మండలం గాజులపల్లె, తమ్మడపల్లె, బొల్లవరం గ్రామాలలో వరి పంటల పైన డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకము కింద వరి పంటలో పంట కోత ప్రయోగాలు నిర్వహించారు.ఈ ప్రయోగాలలో తమ్మడపల్లె గ్రామంలో 25 చదరపు మీటర్ల లో పంటకోత ప్రయోగం చేయగా 10 కేజీల 450 గ్రాములు రావడం జరిగింది అని తెలిపారు.
బొల్లవరం గ్రామంలో 25 చదరపు మీటర్ల లో 11 కేజీల 930 గ్రాములు రావడం జరిగినది.గాజులపల్లె గ్రామంలో వ్యవసాయ అధికారి బి. నాగేశ్వరరెడ్డి పంటకోత ప్రయోగాన్ని తనిఖీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. రైతు శ్రీనివాసులు పొలంలో మొదటి ప్రయోగంలో 25 చదరపు మీటర్ల లో పంట కోత ప్రయోగం చేయగా 19 కేజీల 8 వందల గ్రాములు రావడం జరిగినది. ఈ పంట కోత ప్రయోగాలలో ఒక గ్రామంలోని నాలుగు ప్రయోగాలలో వచ్చిన దిగుబడుల సరాసరి ఆధారంగా పంట బీమా ను ప్రభుత్వం వారు నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి నాగేశ్వరరెడ్డి, గ్రామ వ్యవసాయ అధికారులు పల్లవి, చంద్రశేఖర్, మధు, ఎస్బిఐ ఇన్సూరెన్స్ డివిజనల్ కోఆర్డినేటర్ అరుణ్, ఇన్సూరెన్స్ వెండర్ చంద్ర బోస్, రైతు శ్రీనివాసులు పాల్గొన్నారు.