ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ లో వెంకటేశ్వర స్వామి అదృశ్యం
అభివృద్ధి పేరుతో ఆలయం అదృశ్యం
ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో 53 సంవత్సరాల వెంకన్న ఆలయం శిథిలం
పట్టించుకోని రాజకీయ నేతలు, ఆర్టీసీ ఆర్టీసీ యాజమాన్యం
వెంకన్న ఆలయం పక్కనే మరుగుదొడ్లు,మూత్రశాలలు
వెంకన్న దర్శనం లేకుండా ఇనుప కంచెతో మూసివేసిన ఆర్టీసీ అధికారులు
దర్శన భాగ్యం కల్పించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించిన ప్రయాణికులు, భక్తాదులు
…………………………………..
భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరగబోయే సంచలన సంఘటనలను తన దూర దృష్టితో ఈ ప్రపంచానికే చెప్పగలిగిన,కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా తన దివ్య దృష్టితో చూడలేని.. చెప్పలేని సంఘటన మన ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది.
సుమారు 50 ఏళ్లకు పైగా ఆత్మకూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు వెంకన్న కూడా అదృశమయ్యాడు. పాపం కలియుగంలో ఆ దైవాన్ని మాయం చేసిన ఆత్మకూరు ఆర్టీసీ యాజమాన్యులు.
చేసిన ఈ అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సంబంధిత కారకులు అంతటితో ఊరికే ఉండక ఆర్టీసీ డిపో అభివృద్ధి పేరుతో ఏకంగా వెంకన్న విగ్రహంతో పాటు ఆలయాన్ని కనుమరుగు చేసి ఆలయం ఎదురుగా ఏకంగా మరుగుదొడ్లు,మూత్రశాలలను నిర్మించి ఆర్టీసీ డిపో ఆదాయాన్ని పెంచుకున్నారే తప్ప బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల,భక్తుల,ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసి అవమానించారని వెంకన్న భక్తులు ఆవేదన చెందుతున్నారు.
1972లో ఆత్మకూరుకు ఆర్టీసీ బస్టాండు, డిపో మంజూరు అయితే .. 1978లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మన ఆత్మకూరు పక్కనే ఉన్న కొక్కెరంచ గ్రామానికి చెందిన ఏ వెంగళరెడ్డి గారు ఆర్టీసీ మంజూరు చేసి ప్రారంభించారు.
ఆ సంవత్సరంలోనే ఆత్మకూరు ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణం పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి వెంకన్న ప్రతిష్టించారు.అప్పటినుంచి ప్రయాణికులు,ఆర్టీసీ కార్మికులు నిత్యం ఇక్కడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రయాణాలు మొదలుపెట్టేవారు.తిరుమల వెళ్లే భక్తులు తమ ప్రయాణం సురక్షితంగా సాగాలని పూజలు కూడా చేసేవారు.
అయితే.. 50 నిర్మించిన ప్రయాణికుల భవనాలు శిధిలం కావడం,వాటి స్థానంలో అభివృద్ధి పేరిట కొత్త నిర్మాణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 90 శాతం తొలగించి దాని చుట్టూ కొత్త నిర్మాణాలను చేపట్టారు.
50 ఏళ్ల నుంచి భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను వస్తున్న ఆత్మకూరు ఆర్టీసీ వెంకటేశ్వర స్వామిని మాత్రం పట్టించుకోకుండా అదృశ్యం చేశారు.కనీస పూజలకు స్వామివారి మూలవిరాట్టు నోచుకోవడం లేదు.
ఆలయం చుట్టూ కాంక్రీట్, ఎదురుగా విసర్జన నిర్మించి వెంకటేశ్వర స్వామిని అపచార దిగ్బంధనం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆలయం కనిపించకుండా ఇనుప కంచెలు,అపవిత్ర వస్తువులను అడ్డుపెట్టి కలియుగ దైవం వ వెంకటేశ్వర స్వామిని చేయడంపై భక్తులు కన్నెర్ర చేస్తున్నారు.
కుట్ర వెనక ఆర్టీసీ ప్రాంగణంలోని ఓ అరాచక మూకలే కారణమని.. ఉద్దేశపూర్వకంగానే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూతపడేలా చేసి. వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ భక్తి భావం పై ఓ రకమైన కుట్ర కోన దాడిగా భక్తులు భావిస్తున్నారు.
ఓటు బ్యాంకు అలవాడ కొందరు నాయకులు ఆర్టీసీ వెంకన్నకు జరిగిన అవమాన సంఘటనను ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఏమి చేయలేని స్థితిలో ప్రయాణికులు విమర్శిస్తున్నారు.ఇదే మరో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రం రాచ బాటలు వేసి సౌకర్యాలను కల్పించిన విషయం కూడా పెద్ద లేచి.. చర్చలకు,కుల మత దారితీసింది.
ఆత్మకూరు ప్రాంగణంలో శిధిల షెడ్డులో కనీస పూజలకు కూడా నోచుకోని స్థితిలో భక్తుల పూజల కోసం నిరీక్షిస్తున్న వెంకటేశ్వర స్వామికి విముక్తి కలిగించే వారే లేరా అని ఆవేదన చెందుతున్నారు.










