అలోవీరా గుజ్జును ఎండించి ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా తయారు చేసిన ఔషధాన్ని ముసాంబ్రం అంటారు. ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లోనూ, పచారి దుకాణాల్లోనూ లభ్యమయ్యే నల్లగా గట్టిగా, చేదుగా, మదపు వాసనను కలిగి ఉండే ఈ మూసాం. బ్రాన్ని నీటితో నూరి పట్టువేస్తే వాత నొప్పులు, దెబ్బల వల్ల కలిగే నొప్పులు, రొమ్ము నొప్పి, పార్శ్వశూల తగ్గుతాయి. పది గ్రాముల ముసాంబ్రం చూర్ణానికి ఆయుర్వేద ఔషధ విక్రయాశాలల్లో దొరికే శుద్ధ గంధకాన్ని 2.5 గ్రాములు కలిపి నూరి ఆరు మోతాదులుగా మాత్రలు చేసుకుని ఖాళీ క్యాప్సూల్స్లో ఉంచుకుని ఉదయం, సాంయంత్రం సేవిస్తే మూలవ్యాధిలో ఉత్తమ ఫలితం పొందవచ్చు. అయితే ఈ ఔషదాన్ని ఈ విధంగా 20 రోజులు వాడి పదిరోజుల విరామం తరువాత మళ్లీ 20 రోజులు వాడితే వ్యాధి సంపూర్ణంగా నయమవుతుందని అనుభవ వైద్యం చెబుతోంది.
ముసాంబ్రాన్ని వేడి నీటిలో చిక్కగా కలిపి తమలపాకుకు పూసి కడుపు పైన, పొత్తి కడుపు పైన కడితే చంటి బిడ్డలకు విరేచనమై కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముసాంబ్రం, హారతి కర్పూరం, పచ్చ కర్పూరం సమభాగాలుగా కలిపి సన్నమంటపై వుడికించి మెత్తగా నూరి వుంచుకుని నీటితో నూరి మూల వ్యాధి పిడకలపై లేపనం చేస్తుంటే మూల వ్యాధి తగ్గుతుందని తాళ పత్ర గ్రంథాల్లో రాసి వుంది. పాత బెల్లం, ముసాంబ్రం సమానంగా కలిపి నీటితో నూరి కంకుడు ‘గింజ ప్రమాణం మాత్రలు చేసి ఆరించి బహిష్టు దినాల్లో మూడు రోజులు పరిగడుపున మింగుతుంటే బహిష్టు నొప్పి తగ్గుతుంది. ఈ మూడు రోజులు చప్పిడి పథ్యం చేస్తే చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ముసాంబ్రాన్ని నీటితో నూరి బఠాణి గింజంత మాత్రలు చేసి ఆరించి వుంచుకొని ఉదయం, సాయంత్రం ఒక్క మాత్ర చొప్పున కప్పు గోరువెచ్చని నీటితో సేవిస్తుంటే ఆస్త్మా వ్యాధిలో చక్కటి ప్రయోజనం కలుగుతుంది.
Also Read అందానికి, సౌందర్యానికి..కలబంద
లేదా మిరియాల పొడి, ముసాంబ్రం ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాము చొప్పున తీసుకుని తగినంత అల్లం రసంతో మెత్తగా నూరి గురిగింజంత మాత్రలు చేసి ఎండించి ఉదయం, సాయంత్రం రెండ్రెండు మాత్రల చొప్పున తగినంత గోరువెచ్చని నీటిలో కలిపి తీసికుంటే కూడా ఆస్మా తగ్గుతుంది. ఇదే ఔషధాన్ని స్త్రీలు బహిష్టుకు వారం ముందునుంచి తీసుకుంటే బహిష్టు ముందు వచ్చే వివిధ రకాల ఇబ్బందులు తొలగిపోతాయి.
ముసాంబ్రం, నేల వుసిరి, ఇంగువ, జీలకర్ర, శొంఠి చూర్ణాలను ఒక్కొకటి యాభై గ్రాముల చొప్పున తీసుకుని తగినంత నీటితో నూరి శనగలంత మాత్రలు చేసి ఎండించి వుంచుకుని పూటకొక మాత్ర చొప్పున రోజూ రెండు పూటలా మింగుతుంటే స్త్రీలలో కలిగే తెల్ల బట్ట లేదా వైట్ డిశ్చార్జ్ అనే సమస్య తగ్గుతుంది.
బహిష్టు సక్రమంగా వస్తుంది
ముసాంబ్రం, వసపొడి, జాజికాయల పొడి, గుగ్గిలం పొడి సమానంగా కలిపి నీటితో మెత్తగా నూరి నడుముపై పట్టువేస్తుంటే నడుపునొప్పి తగ్గుతుంది. ముసాంబ్రం, ఇంగువ చూర్ణాలను ఒక్కొక్కటి ఇరవై అయిదు గ్రాముల చొప్పున తీసుకుని తగినంత తేనెతో మెత్తగా నూరి కంది గింజంత మాత్రలు చేసి వుంచుకుని మూడు పూటలా తీసుకుంటుంటే బహిష్టు సక్రమంగా వస్తుంది. బహిష్టు స్రావం సజావుగా జరగుతుంది. బహిష్టు స్రావం సరిగా కాకపోవడం వల్ల కలిగే అధికబరువు, స్థూలకాయం తదితర సమస్యల నుంచి బయటపడవచ్చు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV