కౌలు రైతు అవగాహన సదస్సు

Tenant Farmer Awareness Conference

Tenant Farmer Awareness Conference

కౌలు రైతు అవగాహన సదస్సు

ఆత్మకూరు మండలం లోని ఆత్మకు రైతు సేవ కేంద్రం నందు కౌలు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, ఎవరైతే పొలం కౌలు కు తీసుకొని సాగు చేస్తున్నారో, వారు *తప్పనిసరిగా CCRC కార్డు (or) పంట సాగు హక్కు పత్రం తీసుకోవాలని CCRC కార్డు ఉంటేనే *అన్నదాత సుఖీభవ, పంట నమోదు, పంట భీమా, ఇన్ పుట్ సబ్సిడీ తదితర వ్యవసాయ పథకాలు కౌలు రైతుకు వర్తిస్తాయని తెలిపారు.* కావున కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కౌలుకు తీసుకున్న రైతు అందుకు సంబందించిన అగ్రిమెంట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు భూయజమాని 1బి తదితర జిరాక్స్ కాపీలతో స్థానిక వీఆర్వో గారిని సంప్రదించాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి నాగరాజు, బహుళ ప్రయోజనం విస్తరణ అధికారి ఎస్ రవి గౌడ్ సావిత్రిబాయి మరియు ఆత్మకూరు * కౌలు రైతుల సంఘం అధ్యక్షులు * రైతులు పాల్గొన్నారు

Also Read ..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

మండల వ్యవసాయ అధికారి ఆత్మకూరు

*మొక్క జొన్న పంట లో “కత్తెర పురుగు” ఆశించి నష్టం కలుగ జేస్తున్నట్లు గమనించడం జరిగినది. కత్తెర పురుగు నివారణకు గాను:
I. విత్తు సమయంలో:

  1. లింగాకర్షక బుట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చాలి.
  2. మొక్కజొన్న పంటలో అంతర పంటగా అపరాలను సాగు చేసుకోవాలి.

1.విత్తినప్పటి నుండి 25 రోజుల వరకు:

  • గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి.
    ఎకరానికి వేప నూనె 10000 పీ.పి.యం.: 400 మి.లీ./200 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  1. విత్తిన 25 రోజు నుండి 40 రోజుల వరకు:
    కత్తెర పురుగు లార్వాలను నివారిరించడానికి
  • 5-20% ఆకులు దెబ్బతింటే, పురుగు మందులు ఎకరానికి ఎమామెక్టిన్ బెంజోయేట్,,@ 80 గ్రా
    లేదా రైనాక్సిఫైర్ @ 100 మి.లీ./ఏకరానికి, లేదా
    స్పైనోటరామ్ @ 100మి.లీ. /ఏకరానికి పిచి కారి చేసు కోవాలని రైతులకు సూచించడం జరిగినది.
  1. విత్తిన 40 రోజు నుండి 60 రోజుల లోపు:
    ఈ దశలో యాజమాన్యం చాలా ముఖ్యమైనది. పురుగు ఆశించిన పంటలో క్రింద తెలిపిన మందులలో ఏదైనా ఒకదానిని పిచికారి చేయాలి.
    ఎకరాకు:
    1) స్పైనోసాడ్ – 70 మి.లీ/ఏకరానికి
    2) రైనాక్సిపైర్ – 80 మి.లీ/ఏకరానికి
    3) స్పైనోటరామ్ 100 మి.లీ./ఏకరానికి
    4) ఎమామెక్టిన్ బెంజోయేట్ – 80 గ్రా.ఏకరానికి
    5) థయేమిథాక్సామ్ + లామ్డా సైహలోత్రిన్ @ 100 మి.లీ./ఏకరానికి పిచికారి చేసు కోవాలని రైతులకు తెలియజేయడం జరిగినది.
    ఈ సూచనలను రైతులకు “రైతుసేవ కేంద్రాల” ద్వార తెలియచేయాలని డాక్టర్ ఏ రామకృష్ణారావు, మండల వ్యవసాయ అధికారిని మరియు ఏ.డీ.ఏ. కోరారు
    Aslo Read.. నల్లమల అడవులకు గజ రాజులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top