వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం
కేటీఆర్ కు జగన్ మోహన్ రెడ్డిల మద్య సంబాధలను చెప్పనవసరం లేదు..2014 ఎన్నికల ముందు కానీ అలాగే 2024 ఎన్నికల ముందుకానీ మీడియా ముందు
పలుమార్లు వైఎస్సార్ సిపి పార్టీ , జగన్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే..
వైసీపీ ఓటమిపై సంచలన వాక్యలు
తాజాగా వైసీపీ ఓటమిపై కూడా సంచలన వాక్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
40 శాతం ఓట్లు వైసీపీ సాధించింది
అయినా 40 శాతం ఓట్లు వైసీపీ సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీయే కూటమితో కాకుండా పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు.
పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే..
వైఎస్ జగన్‌ను ఓడించేందుకు వైఎస్ షర్మిలను వస్తువులా వాడుకున్నారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు.
ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు అహంకారమా
అహంకారం, ఆత్మ విశ్వాసం తేడా తెలియక, అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు.
ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అన్న కేటీఆర్, తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందన్నారు.
నల్లమలకు అడవి దున్న – Adavi Dunna
హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం, అభివృద్ధిని మేము జనానికి చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదనన్నారు.
ఫిరాయింపుల అంశం పొలిటికల్
మరోవైపు, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్ హీటెక్కిస్తోంది. బీఆర్‌ఎస్- కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.
పార్టీ ఫిరాయింపులను మొదలు పెట్టిందే కాంగ్రెస్
ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది.
ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్న గులాబీపార్టీ నేతలు హస్తినలో రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించారు. ఎన్నికల కమిషన్‌తోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
దేశంలో పార్టీ ఫిరాయింపులను మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మాది తప్పు అని మాజీ మంత్రి
ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందని.. మా వైఖరి మార్చుకోవాలని.. ప్రజలది తప్పు అనడమంటే.. మాది తప్పు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచామని.. అభివృద్ధిని మేము చెప్పుకోలేదు. టీఆర్ఎస్ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదన్నారు.