తెలంగాణాలో జరిగే శింగవోటం (సింగోటం) జాతరకు ఆంద్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు . ఐతే ఈసారి బోటు ప్రయాణం నిషేదిస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆంద్రప్రదేశ్ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా కృష్ణ నది పరీవాహక ప్రాంతమైన సంగమేశ్వరం, సిద్దేశ్వరం మరియు జానాలగూడెం నుండి తెలంగాణ రాష్ట్రం అవుతలి ఒడ్డు కు బోటు మరియు తెప్పల రాకపోకలను నిషేదం వుందని.. తెలంగాణ రాష్ట్రం అవతలి ఒడ్డున జరిగే సింగోటం జాతరకు సంగమేశ్వరం నుండి బోటు ప్రయాణం ఆపివేస్తున్నట్లు ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ప్రకటన విడుదల చేశారు . సింగోటం జాతర అయిపోయేంత వరకు, పై ప్రదేశాల యందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు . శింగవోటం జాతర కు వెళ్ళు ప్రజలు రోడ్డు మార్గాన వేళ్లుటకు RTC అధికారులు RTC బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . కనుక జాతర వెళ్ళు వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనీ తెలియపరుస్తూ మరియు ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లఘించి బోట్స్ మరియు తెప్పలను నడిపిన వారి పైన మరియు అందులో ప్రయాణించిన వారి పైన చట్ట పరమైన చర్యలు తీసుకొని, బోట్స్ ను సీజ్ చేయడం జరుగుతుందని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం హెచ్చరికలు జారీ చేశారు . కొత్తపల్లె మండలం సంగమేశ్వరం నుంచి నాటు పడవల్లో అవతలి ఒడ్డుకు పది నిమిషాల్లో చేరుకుంటారు . అదే బస్సు ప్రయాణం అయితే నాలుగు గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొత్తపల్లె నుంచి ఆత్మకూరుకు వచ్చి కర్నూలు చేరుకొని అక్కడి నుంచి సింగోటం చేరుకోవాలి.
తరుచూ ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు . ఈ నిబంధనలు ఎప్పటినుండో అమలులో వున్న పోలీసుల నిర్ణయాన్ని భేఖాతారు చేస్తూ ..పోలీసుల కన్నుకప్పి ఎధావిధిగా బోటు ప్రయాణం భక్తులు కొనసాగించేవారు . ఈ సారి పోలీసులు బోటు ప్రయాణాన్ని ఏవిధంగా నిషేధాజ్ఞలు అమలు పరుస్తారో వేచి చూడాలి.