శిల్పన్న మాటిచ్చాడు… బాధితులను ఆదుకున్నాడు

bcbb1036-6171-4fa8-a7c3-0d76a1a7d060.jpg

శిల్పన్న మాటిచ్చాడు… బాధితులను ఆదుకున్నాడు

శిల్పన్న అంటేనే భరోసా… ఒకసారి మాటిచ్చాడు అంటే ఎలాగైనా సాధిస్తాడు. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది.
తాజాగా శ్రీశైలం అగ్ని ప్రమాద బాదితుల్ని ఆదుకున్న ఎమ్మెల్యే శిల్పా ప్రజా సేవ లో శిఖరాగ్రాన నిలిచాడు.

శ్రీశైలంలో లలితాంభిక దుకాణ సముదాయంలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగి 14 షాప్ లు దగ్ధం అయ్యాయి. అది శ్రావణ మాసం కావడంతో పూజా సామాగ్రి, ఇతర వస్తువులు కాలిపోయి లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది.
సాధ్యం కానిది సాధించిన ఎమ్మెల్యే శిల్పా

దుకాణాలు వేలం పాటలో దక్కించుకుని నిర్వహించుకుంటున్నారు.
కాబట్టి ఇక్కడ జరిగిన నష్టానికి పరిహారం రావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి. ప్రతి దుకాణం దారు వారి సామాన్ల విలువకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ చేసుకుని ఉండాలి.
ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ పరిహారం రావడం చాలా కష్టం. సీఎంఆర్ఎఫ్ నిబంధనలు కూడా వర్తించవు . ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేం ఇవ్వలేం అంటూ చేతులెత్తేశారు.
దీంతో బాధితులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని ఆశ్రయించారు.
వారికి తక్షణ సహాయంగా ఎమ్మెల్యే శిల్పా స్వయంగా 20000 రూపాయలు చొప్పున పరిహారం అందించాడు. ప్రభుత్వం తరఫునుంచి ఎలాగైనా ఆదుకునేలా చూస్తానని మాట ఇచ్చారు .
ఇది కింది స్థాయిలో అయ్యే పని కాదని ఆయనకు తెలుసు.
సీఎం కు నేరుగా లెటర్ పెట్టారు.
మొన్న దసరా ఉత్సవాలకు రమ్మని ముఖ్యమంత్రిని శ్రీశైలం కు ఆహ్వానం అందించేందుకు దేవస్థానం కమిటీతో పాటు ఎమ్మెల్యే శిల్పా కూడా వెళ్ళాడు.
అదే అదనుగా శ్రీశైలం అగ్ని ప్రమాద బాధితుల గురించి సీఎం దృష్టిలో వేశారు. ప్రమాదం వల్ల బాదితులు ఎంత నష్టపోయింది స్వయంగా చెప్పడంతో సీఎం స్పందించి ఒక్కొక్కరికి రు 4 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేశారు. నిన్న ఆ చెక్కులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.
పట్టు వదలని విక్రమార్కుడు లా ఎమ్మెల్యే పాటుపడి పరిహారం సాధించి తమను ఆదుకున్నారు అని బాదితులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top