శిల్పన్నకు సిద్దించిన సిద్దాపురం

IMG-20221126-WA0054.jpg

*శిల్పన్నకు సిద్దించిన సిద్దాపురం*———*అభివృద్ధి బాటలో మాజీ నేరస్తుల పల్లె*———-సిద్దాపురం అంటే… జిల్లా లోనే అతి పెద్ద చెరువు…సిద్దాపురం అంటే… 24000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఎత్తిపోతల పథకం….సిద్దాపురం అంటే… మాజీ నేరస్తుల గ్రామం..సిద్దాపురం అంటే మారుమూల కుగ్రామం…సిద్దాపురం అంటే… ఘాటేక్కించే నాటు సారా ఊట..కాదు కాదు…సిద్దాపురం అంటే అభివృద్ధికి చిరునామా….ఇలా ఆ ఊరి గురించి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతారు.కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం…*సిద్దాపురం అంటే మా శిల్పన్న* అని చెబుతారు.

బ్రిటిష్ కాలం లో కరుడు గట్టిన నేరస్తులను సంస్కరించేందుకు ఏర్పాటైన పునరావాస కాలనీ ల్లో సిద్దాపురం ఒకటి.ఊరు అయితే ఏర్పడింది గానీ, సంస్కరించింది లేదు.. ఉపాధి మార్గాలు చూపింది లేదు.ఏ నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదు.ఎందుకంటే.. ఆ గ్రామం లో రాజకీయ స్థిరత్వం లేదు. ఈ ఊరోళ్లు ఎన్నికల నాడు ఎటు మొగ్గుతారో ఎవరు అంచనా వేయలేరు. ఏ నాయకుడికీ గ్యారంటీ లేదు.అందుకే ఏ అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం సరైన రోడ్డు లేదు. భవనాశి వాగు ఉప్పొంగితే దాటేందుకు వంతెన లేదు.*శిల్పన్న వచ్చాడు… అన్నీ ఇచ్చాడు*శిల్పా చక్రపాణి రెడ్డి కి ఓట్ల రాజకీయం చేసే అలవాటు లేదు.. అభివృద్ధి మంత్రమే ఆయన అభిమతం. 2014 లో పాదయాత్ర కు వచ్చినప్పుడు ఈ ఊరు దీన స్థితి చూశాడు. ఎలాగైనా అభివృద్ధి చేయాలని సంకల్పించాడు.2016 లో ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల నిధులతో సీసీ రోడ్లు వేయించాడు. స్మశానానికి దారి లేకుంటే సొంత నిధులిచ్చి వేయించాడు. సబ్సిడీ కింద వ్యవసాయ బోర్లు వేశాడు. PMGSY కింద 60 లక్షలు తో భవనాశిపై వంతెన వేయించాడు. కోటి రూపాయలు పైబడి CC రోడ్ల తో ఊరికి కొత్త శోభ తెచ్చాడు.2018-19 సంవత్సరాల్లో చెరువు ప్రధాన కాలువ నుంచి సాగు నీరు అందని పొలాలకు సొంత డబ్బుతో మోటార్లు పెట్టి పంపింగ్ చేయించి అపర భగీరధుడయ్యాడు.అన్నిటికి మించి పెండింగ్ లో ఉన్న ఎత్తిపోతల పథకం పూర్తి చేయించి 3 కార్లకు నీరిప్పించాడు.ఊర్లో ఎటు చూసినా పచ్చదనమే.. ఊరు చుట్టూ పంట పోలమే…ఇన్ని చేశాడు కాబట్టి, సిద్దాపురం ఎప్పుడో శిల్పన్న కు సిద్దించింది.*అందుకే ఇప్పుడు సిద్దాపురం అంటే శిల్పన్న* అని మాత్రమే అక్కడ వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top