కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు
సంగమేశ్వరునికి కృష్ణా జలాలు చుట్టుముట్టాయి
సంగమేశ్వరునికి గర్భాలయంలోకి చేరిన కృష్ణా జలాలు
మరి కొద్ది గంటల్లోనే పూర్తి జలాధివాసం కానున్న సప్తనదుల సంగమేశ్వర ఆలయం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టుముట్టాయి ఎగువ రాష్ట్రలైనా కర్ణాటక మహారాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాం కు వరద ప్రవాహం పెరిగింది .. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటిమట్టం 845 అడుగులు చేరువ కావడంతో… శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ సప్త నదుల సంగమేశ్వర ఆలయం లోకి నీరు చేరింది.
గర్భాలయంలోని వేపదారు శివలింగం కృష్ణమ్మ ఒడిలోకి చేరి పూర్తిగా జలాదివాసం అయింది
మరి కొద్ది గంటల్లోనే సంగమేశ్వర ఆలయం కూడా కృష్ణా జలాల్లో పూర్తిగా నీట మునగనుంది
సప్త నదుల సంగమేశ్వరుని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి చివరి పూజా కంకర్యాలు నిర్వహించారు
కృష్ణమ్మకు చీరే, సారే సమర్పించి హారతి ఇచ్చారు.
ధర్మరాజు ప్రతిష్టించిన ఆ శివలింగం భక్తులకు దూరమై .. పూజలు నోచుకోలేక మరో ఏడు నెలలు జలాధివాసంలోనే గడప నున్నాడు
మరి కోద్ది గంటల్లోనే… సంగమేశ్వరుర ఆలయం పూర్తి జలదివాసం కానున్నట్లు.. ఆలయ అర్చకులు తెలుక పల్లి రఘురామ శర్మ తెలిపారు.
ఇక భక్తులకు సంగమేశ్వరుడి దర్శనం భాగ్యం కలగాలంటే మరో ఏడు నెలలు ఆగాల్సిందే…
సంగమేశ్వర ఆలయానికి ఉన్న ప్రత్యేకత ..
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఈ సంగమేశ్వర క్షేత్రం ఉంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర ,మలాపహరిణి, భీమరథి భవనాసి లు ఒక్కటిగా కలిసే ప్రాంతం ఇది.
ఈ ఏడు నదులు కలిసేచోట దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన స్థలం ఇదేనని, అందుకే ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వర క్షేత్రం అని అంటారని, స్కాందపురాణంలో వుంది…
సప్త నది సంగమ క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ధర్మరాజు వనవాస సమయంలో ప్రతిష్టించిన వేప దారు శివలింగం ఇక్కడ ప్రముఖంగా పూజలందు కుంటుంది.
Aslo Read సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రం విశిష్టత
భీముడు ప్రతిష్టించిన భీమ లింగం. విశ్వామిత్రుడి గృహాలు, విశ్వామిత్రుడు తపస్సుకు మెచ్చి గోపాలగిట్ట రూపంలో దర్శనమిచ్చిన గాయత్రి దేవి పాదముద్రికల ఆనవాళ్ళు ఉన్నాయి.
ద్రౌపతి దేవి క్షేత్ర సందర్శన సమయంలో పాయసం వండిన ప్రదేశాలు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. క్షేత్ర ఆవరణంలో రుద్రాక్ష మండలం ఉంది.
విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడికి రెండు పర్యాయాలు సందర్శించినట్లు చెబుతారు.
ఆ సమయంలో దేవుడి పేర మాన్యం భూములు ప్రకటించి శిలా శాసనాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.
మహా చక్రవర్తి శివాజీ మహారాజ్ కూడా సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన తర్వాతే శ్రీశైలం భ్రమరాంబ దేవి అనుగ్రహాన్ని పొందినట్లు చెబుతారు….
శ్రీశైలం డ్యామ్ నిర్మాణం
Also Read Samsung 189 cm (75 inches) 8K Ultra HD Smart Neo QLED TV
శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత 1980లో సప్తనదీ సంగమేశ్వరం కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుంది. అప్పటి నుంచి 24 సంవత్సరాలపాటు జలాధివాసం ఆయన సంగమేశ్వరం 2000లో బయట పడి భక్తులచే పూజలందుకుంటున్నాడు.