అత్తగారింటికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు చోరీ…
తెల్లవారు జామున బస్సు సర్వీసులు లేకపోవడంతో..
ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో పెట్రోలు బంకు దగ్గర పార్కు చేసి ఉన్న AP 39 UK – 7439 నెంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సును.. అత్తగారింటీ కి తీసుకెళ్లిన తీసుకెళ్లిన దర్గయ్య అనే వ్యక్తి..
బస్సును సరాసరి ముచ్చుమరి గ్రామంలోని అత్తగారింటికి తీసుకెళ్లిన దర్గయ్య
మళ్లీ ఆ బస్సును ముచ్చుమరి పోలీస్ స్టేషన్ లో తనే అప్పగించిన దర్గయ్య
అత్తగారి ఇంట్లో ఉన్న తన భార్యను చూడడానికి ముచ్చుమర్రి కి రావడానికి చార్జీకి డబ్బులు లేక బస్సును తెచ్చినట్లు తెలిపిన దరగయ్య.. బస్సును పోలీసులకు అప్పగింత
నంద్యాల జిల్లా, పగిడాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఓఇంటి అల్లుడు ఏకంగా ఆర్టిసి బస్సు నే తీసుకొని వచ్చాడు.
వివరాల్లోకి వెళితే ఆత్మకూరు మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య ముచ్చుమర్రి గ్రామంలోని తన అత్తగారింటిలో ఉన్న తన భార్య దగ్గరకు వెళ్లడానికి తెల్లవారుజామున మూడింటికి బయలుదేరాడు..
ఆ సమయంలో ముచ్చుమర్రి కి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు లేవు.
చేతిలో డబ్బులు లేవు .. దర్గయ్య కు ఏం దిక్కు దోచలేదు..
ఆసమయంలో ఆర్టీసీ బస్సు సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర పార్కు చేసిన AP 39 UK – 7439 నెంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు దర్గయ్య కు కనపడింది.
దర్గయ్య డ్రైవింగ్ లో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో తాళాలు లేకపోయినా.. తన కున్న అనుభవంతో..వైర్ కనెక్షన్లను డైరెక్ట్ చేసి బస్సును స్టార్ట్ చేసుకొని
ముచ్చుమరి గ్రామానికి బయలు దేరాడు..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
బస్సును గమనించిన సదరు ఆర్టీసీ డ్రైవర్లు ఆ బస్సును ఆపడానికి ప్రయత్నించగా సైడ్ ఇవ్వకుండా సరా సరి ముచ్చు మర్రికి వెళ్లిపోయాడు.
ఏదైతేనేం రూపాయి ఖర్చు లేకుండా తన భార్యను చూడ్డానికి గ్రామానికి చేరుకున్న దరగయ్య.. ముచ్చుమరి పోలీస్ స్టేషన్ లో బస్సును అప్పజెప్పాడు.
ఎవరో అక్కడ పార్క్ చేసి ఉన్నారని నేను తీసుకొచ్చి మీకు అప్పజెబున్నా నని పోలీసులకు చెప్పాడు.
అప్పటికే సమాచారం అందుకున్న ముచ్చుమరి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు.
తన దగ్గర డబ్బులు లేక , తెల్ల వారుజామున రవాణా సౌకర్యం లేకపోవడంతో బస్సును తీసుకొచ్చి నట్లు దరగయ్య వివరించాడు.
దీంతో దర్గయ్య బంధువులను పోలీసులు పిలిపించి విచారించగా దరగయ్యకు మతిస్థిమితం సరిగా లేదని.. గతంలో కూడా ఆత్మకూరు మండలం వెకటాపురం గ్రామానికి చెందిన ఓ లారీ ని తీసుకోచ్చాడని.. తెలిపారు
మతిస్థిమితం సరిగా లేనందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడని బంధువులు పోలీసులకు వివరించారు..
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు
ఆత్మకూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కు ముచ్చుమర్రి పోలీసులు సమాచారం అందించి. అదే బస్సులోనే దర్గయ్య ను ఎక్కించుకొని ఆత్మకూరుకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు.
బస్సును చోరీ చేసిన దరగయ్యకు మతి స్థిమితం సరిగా లేదని తెలియడంతో .. అటు పోలీసులు కేసు పెట్టలేక , ఇటు బస్సు యజమానులు కూడా ఏమి చేయలేని పరిస్థితి