బూడిద టెన్షన్ .. టెన్షన్
కూటమి పెద్దల వార్నింగ్ బేఖాతర్
ఆది జేసీ రగడ రగడే
రాజీ తంత్ర ఫలితం సస్పెన్స్ సస్పెన్స్
ఇక ఆర్టీపీపీ కుయ్యో మొర్రో
రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో బూడిద దందాగిరి సెమీ సంక్రాంతిని తలపిస్తోంది. ఈ బూడిద కోసం ఇటు తాడిపత్రి డేగ.. అటు జమ్ముల మడుగు కాకి రెక్కలు టపటపలాడించి.. గొంతు చించుకొంటున్నాయి. ఈ రెండు కోళ్ల సవాళ్ల కూతలతో ఆర్టీపీపీ దద్దరిల్లిపోతోంది. ఏ క్షణంలో ఈ కోళ్లు కత్తులతో ఏ బరిలో దిగుతాయో అర్థం కాక పోలీసులు తలపట్టుకుని.. సరిహద్దులను అష్టదిగ్భంధనం చేశారు. మరో వైపు అధికార కూటమి పెద్దలు తగ్గండి ..తగ్గండి లేదో తాట తీస్తాం అని హూంకరించినా..
ఆది జేసీ కోళ్లు ఎక్కడా తగ్గటం లేదు. ఎనీ హౌ ఈ రెండు వర్గాల బూడిద జగడం మూడో రోజుకు చేరింది. రెండు పిట్టల పోరు పిల్లి తీర్చ కూడదదంటూ ఇరు వర్గల మధ్య ఎడతెరపిలేని రాజీ చర్చలు యథాస్థితిలోనే ఉన్నాయి. ఎక్కడా ఏ ఒక్కరూ తగ్గటం లేదు. రాజీతంత్రం తెగటం లేదు. మిగిలింది ఒక్కటే.. హక్కు భుక్తం షరతు. ఎవరు ఎవరికి హక్కు రాసివ్వాలో తేలటం లేదు. తాడిపత్రికి బూడిద తరలించటానికి జమ్మలమడుగు యువరాజుకు తాడిపత్రి మహారాజు అనుమతి ఇవ్వాలి. ఇది జేసీ బ్రదర్స్ నిబంధన.