సీబీఐకి దొరికిన గుంతకల్లు రైల్వే DRM

Railway DRM Guntakallu arrested by CBI

Railway DRM Guntakallu arrested by CBI

సీబీఐ వలలో గుంతకల్లు రైల్వే ఉద్యోగి

ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న అడికారులు రాష్ట్రం లో ఎక్కడో ఓకచోట అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికి పోతున్నారు. ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్న

అడ్డదారిలో సంపాదించడం మాత్రం మనుకోలేక పోతున్నారు .. తాజాగా గుంతకల్లు రైల్వే ఉద్యోగి సీబీఐ అడికారులకు దొరికిపోయాడు.

AP : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో తొలిసారిగా ఓ అత్యున్నత అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. లంచం తీసుకొని అవినీతికి పాల్పడిన డీఆర్ఎం తోపాటు

ఉన్నత అధికారులను అరెస్ట్ చేశారు. రైల్వే డివిజన్ చరిత్రలో ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవటంతో

రైల్వే ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లో వెళితే.. AlsoRead

రైల్వేలోనే సూపర్ హిస్టరీ..

గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో సీబీఐ సోదాలు మూడు రోజులుగా మాటు వేశారు. ఎట్టకేలకు కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుండగా

రెడ్ హ్యాండెడ్ గా డీఎఫ్ఎం,ప్రదీప్ బాబు, ఓ ఎస్ బాలాజీ సహా సీనియర్ అసిస్టెంట్లులతో సంబంధంఉన్న డీఆర్ఎం వినీత్ సింగ్ లను అరెస్ట్ చేశారు.

చిత్తూరు జిల్లా పీలేరు వద్ద కాంట్రాక్టర్లు సత్యనారాయణ, రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ. 120 కోట్ల వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈ కాంట్రాక్టు పర్సంటేజీ

వంతెన నిర్మాణ కాంట్రాక్టు పర్సంటేజీలను అడగడంతో కాంట్రాక్టర్లకు అధికారులతో ఆరు నెలల కిందట గొడవ జరిగింది.

ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్‌ డివిజన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ (డీఎఫ్‌ఎం) ప్రదీప్‌బాబు సహా మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే

ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు గత మూడు రోజులనుంచి గుంతకల్లులో మకాం వేశారు. కదిరి ప్రాంతంలో రైల్వే పనులను కాంట్రాక్టర్లకు

వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రదీప్‌బాబుతో పాటు కొందరు సిబ్బంది డబ్బును డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

సీబీఐకి దొరికిన గుంతకల్లు డీఆర్ఎం

ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు ప్రణాళిక బద్ధంగా మూడు రోజులు కిందట మకాం వేశారు. ఈ దాడుల్లో మొదట ఓఎస్ బాలాజీకి రూ. 5 లక్షల నగదు సంచి ఇస్తుండగా

సీబీఐ అధికారులు పట్టుకున్నారు.ఫోన్ ట్యాపింగ్ తో సంభాషణఆధారంగా డీఎఫ్ ఎం, డి ఆర్ఎం, ఓ ఎస్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కాంట్రాక్టర్ నుఅరెస్ట్ చేశారు.

అదే విధంగా గుంతకల్లురైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ నివాసంలోనూ , ఆయ‌న కార్యాల‌యంపై సీబీఐ అధికారులు దాడిచేశారు…

ఆయ‌న తో పాటు డీఎఫ్‌ఎం ప్రదీప్‌ బాబు, రైల్వే ఉద్యోగులు రాజు, ప్రసాద్‌, బాలాజీల ఇంటిపై సిబిఐ అధికారులు గ‌త మూడు రోజులుగా సోదాలు నేటితో ముగిశాయి..

భారీగా పట్టుబడిన బంగారం , నగదు

ఈ సోదాల‌లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. దీంతో మొత్తం 8 మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ లో డిఇఎన్ కోఆర్డినేషన్ అక్కిరెడ్డి ని అరెస్టు చేశారు.

150 తర్వాత నల్లమల అడవిలో ప్రత్యక్షమైన అడవిదున్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top