పీర్ల పండుగ విశిష్టత
మహమ్మదు ప్రవక్త మనవడు హిమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా ముస్లింలు మొహర్రం పండుగ జరుకుంటారు
అప్పటి దుర్మార్గ యజీద్ చక్రవర్తి దురాగతాలు దౌర్జన్యాలపై ఇమామ్ హుస్సేన్ ఎదురొడ్డి పోరాడారు.
శాంతియుత సమసమాజ స్థాపన కోసం కర్బలా మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం చేసి త్యాగనిరతికి మారుపేరు అయ్యాడు.
పవిత్ర పోరులో అమరులైన ఇమామ్ హుస్సేన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ పదిరోజులపాటు నివాళులర్పిస్తారు.
మొహరం ఉత్సవాలను కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో సవార్లను అనగా పీర్లను మొక్కుతారు కోరిన కోరికలు తీర్చే మహత్యం పీర్లకు ఉందని నమ్ముతారు.
భువికి ధైవ సందేశాన్ని తీసుకువచ్చిన మహమ్మద్ ప్రవక్త సమాజంలో ఉన్న అన్యాయాలను అక్రమాలను నిలధీశాడు ప్రజారంజక పాలనను ఆకాంక్షించాడు.
జనమంతా సుఖసంతోషాలతో జీవించాలని అభిలషించాడు మహమ్మద్ ప్రవక్త మరణానంతరం పాలన సారించిన హజరత్ హబూబ్ హతక్ ,
హజరత్ అలీ,హజరత్ ఉమర్లు సైతం మంచి పాలన అందించి ప్రజల మన్నలను పొందారు.
ఐతే ఆతర్వాత వచ్చిన మావియా అనే చక్రవర్తి ప్రజలను పీక్కు తినడం మొదలు పెట్టాడు అతడి వారసుడిగా వచ్చిన యజీద్ ఏకంగా రాక్షస పాలన కొనసాగించాడు.
చెడు అలవాట్లకు బానిసైనా రాజు ప్రజలను వేధిస్తుంటే హిమామ్ హుస్సేన్ ఎదురు తిరిగారు ప్రజలంతా హుస్సేన్ పక్షాన నిలిచారు.
ఖర్బాలా మైదానంలో సమరం ప్రారంభం
శాంతి మార్గమే శ్రేయస్కరమనీ హుస్సేన్ చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చిన రాజు యుద్ధం ప్రకటించించారు.
మొహర్రం నెల ఒకటవ తేదీనా ఖర్బాలా మైదానంలో సమరం ప్రారంభం అవుతుంది ఎజీద్ సైన్యం వందల మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటుంది
హుస్సేన్ కుటుంభీకులను రోజుకొకరిని శత్రుసైన్యం పాశవికంగా హతమారుస్తుంది.
Also Read ..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
మొహర్రం నెల పదవరోజున యజీద్ సేనలు రెచ్చిపోతాయి అయినప్పటికీ వెనకడుగు వేయకుండా హుస్సేన్ అనుచరులు వీరోచితంగా పోరాటం సాగిస్తూనే ఉంటారు.
సాయం సంధ్య వేళ నమాజ్ చేస్తున్న హిమామ్ హుస్సేన్ను శత్రు సైన్యం చుట్టుముడుతుంది ప్రార్థనలో భాగంగా భూమి పై తల ఆనించిన వెంటనే శిరస్సును చేధిస్తుంది.
హిమామ్ హుస్సేన్ తలతో శత్రు సైన్యం ఊరేగుతూ విజయోత్సాహం జరుపుకుంటుంటుది. హిమామ్ హుస్సేన్ భలి ధానంతో పాటు సమసమాజ స్థాపన కోసం..
ప్రాణత్యాగం చేసిన ఆయన కుటుంబ సభ్యులను ప్రజలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తారు.
అప్పటినుంచి పీర్ల పండుగ ఆనవాయితీగా వస్తుంది. హుస్సేన్ సృత్యర్దం సియా ముస్లింలు కత్తులు బ్లేడులతో తమ శరీరాలను గాయ పరుచుకొని రక్తం చిందిస్తారు.
విరోచిత పోరాటం చేసి యుద్ధంలో వీర మరణం పొందిన వారికి నివాళులు అర్పిస్తారు.
హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా రక్తం చిందించడం గుండెలను బాదుకుంటూ ఊరేగింపు నిర్వహించడాన్నే మాటం అంటారు మొహర్రం నెల పదిని అసురాగా పిలుచుకుంటారు.
గ్రామాల్లో కొలువు తీరే అసన్ హుస్సేన్ ల పేరిట వెలిసే సవార్లను అనగా పీర్లను భక్తి శ్రద్దలతో కులమతాలకు అతీతంగా కొలుస్తారు.
Aslo Read.. నల్లమల అడవులకు గజ రాజులు
పీర్లను ముస్లింలతో పాటు హిందువులు కూడా నమ్మి కొలుస్తారు. పీర్లకు మొక్కితే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.
పీర్ల మొక్కుతో పిల్లలు పుడితే వారికి హసన్ హుస్సేన్ అని హిందువులైతే ఆశన్నా ఊసన్నా అని ఆడపిల్లలైతే ఆశక్కా ఊసక్కా అని నామకరణం చేస్తారు.
ఇలాంటి పేర్లు గల వారు చాలా మంది కనిపిస్తారు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తారతమ్య భేదాలు లేకుండా అందరు పాల్గొంటారు.
పీర్లను నమ్మేవారు మొహర్రం నెలవంక కనిపించిన నాటినుండి నిమజ్జనం జరిగే వరకు మధ్యం మాంసాహారానికి దూరంగా ఉంటారు.
పీర్లకు మలీద ముద్దలు చక్కెర కలిపిన కొబ్బరి తురుము
నిష్టగా వుండి కటిక నేలపైనే నిద్రపోతారు పీర్లకు మలీద ముద్దలు చక్కెర కలిపిన కొబ్బరి తురుము వైవిధ్యంగా సమర్పిస్తారు.
పీర్ల వద్ద అగ్ని గుండం అనగా ఆల్వా ఏర్పాటు చేసి దాని చుట్టూ కాల్లకు గజ్జలు కట్టుకొని డప్పు చప్పుల్ల మద్య లయ బద్దంగా అసైధుల్లా ఆడతారు.
నిప్పు కనికలపై పీర్లు పట్టుకొని నడవడాన్ని మహత్యంగా భావిస్తారు. పీర్లు పట్టిన వారికి పూనకం వచ్చినప్పుడు వారితో తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం కోరుతారు
సవార్లు పట్టుకొని ఎగురుతున్నప్పుడు పిల్లలు లేని మహిళలు కొంగు చాచి నిలబడతారు పీర్లకు
అలంకరించిన పూలు ఆకులు దండల్లోనుంచి కొంగులో పూవు పడితే బాలుడు ఆకుపడితే బాలిక పుడుతుందని నమ్ముతారు.
తమ కోరిన కోర్కెలు తీర్చడం వల్లే పీర్లను నమ్ముతున్నామని భక్తులు తెలుపుతూ వుంటారు ఆఖరి రోజు
ఖర్బాలా వూరేగిస్తారు. పీర్ల నిమజ్జనంలో వందల మంది పాల్గొని పీర్లకు అల్విదా పలుకుతారు