ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చెందిన జిల్లా ఏరువాక కేంద్రం, నంద్యాల ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు కో-ఆర్డినేటర్ డా. ఏ. రామకృష్ణారావు,
ఆత్మకూరు ఏ.డి.ఏ. బి ఆంజనేయ, మండల వ్యవసాయ అధికారి, ఆత్మకూర్, విష్ణువర్ధన్ రెడ్డి సంయుక్తంగా కలిసి ఆత్మకూరు మండలంలోని
‘ కరివేనా’, ‘నల్లకాలువ’, మరియు ‘బాపనంతా తాపురం’ గ్రామాలలోని మొక్కజొన్న పంటలను పరిశీలించడం జరిగినది.
ప్రస్తుతం మొక్క జొన్న పంటసాగు చేసి 15నుంచి 20రోజులు అవుతుందని, జూలై 8 వ తేదీన ఆత్మకూరు డివిజన్లోని ఆత్మకూరు, కొత్తపల్లి వెలుగోడు,
పాములపాడు మండలాలలో అధిక వర్షాల వల్ల అక్కడక్కడ లోతట్టు పొలాలలో నీరు నిలిచి ఉన్నట్లు మరియు మొక్కజొన్న పంటలో..
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
కత్తిరి పురుగు ఆశించినష్టం కలిగి చేస్తున్నట్లు గమనించడం జరిగినది. *అధికవర్షాల వల్ల పంటలనుఏ విధంగా సంరక్షించుకోవాలనే విషయాలను
ప్రిన్సిపల్ సైంటిస్ట్ & కోఆర్డినేటర్, డా.ఎ.రామకృష్ణారావు, రైతులకు ఈ క్రిందిసూచనలను తెలియజేశారు.
పంటల పొలాల్లో అధికతేమ మరియు వర్షపునీటి ముంపునకు గురైమొక్కలకు “మొదలుకుళ్ళు” మరియు
“వేరుకుళ్ళు “ఆశించినష్టం కలుగ జేయడానికి అవకాశంఉన్నట్లు రైతులకు తెలియజేశారు.
- పంటలలో వర్షపు నీరు నిలబడినప్పుడు నీటిని కాలువ తీసి పూర్తిగా తీసి వేయాలి.
- వర్షాలు ఆగినతర్వాత మరియుపొలాలు ఆరినతర్వాత ఎకరానికి యూరియా: 25 కేజీ లు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 25 కేజీలు వేసుకోవాలి .
3.ఎకరానికి 19-19-19: 1 కేజీ, లేదా 20-20-20 : 1 కేజి లేదా పొటాషియం నైట్రేట్ (మల్టీ- కె) ఎకరానికి :2 కేజీలు, బోరాన్: 300 గ్రాములు, యురియా: 2 కేజీలు లేదా డై అమ్మోనియం ఫాస్ఫేట్: 2కేజీలు 200 లీటర్ల నీటిలో కలిసి మొక్కలు బాగా తడిచే టట్లు పిచికారి చేసుకోవలెను.
- అధిక వర్షాల ల వల్ల పంటలలో మొగ్గలు, పూత, కాయలు ఎక్కు వగా రాలి పోతుంటే రైతులు వెంటనే ప్లానోఫిక్స్ (ఎన్.ఎ.ఎ 10 పి.పి.యం) ఎకరానికి 50 మి.లీ ను 225 లీటర్ల నీటిలో కలిపి మొక్కలంతా బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవలెను.
5.వర్షాల వల్ల పంటలలో వేరు కుళ్ళు మరియు మొదలు కుళ్ళు నివారణకు గాను, ముందుగా “మొదలు కుళ్ళు” మరియు “వేరుకుళ్ళు”ఆశించిన మొక్కలను తీసివేయవలెను.
ఆ తర్వాత కావర్ ఆక్సీ క్లోరైడ్ (బ్లైటాక్స్) ఎకరానికి 600 గ్రా ములు లేదా కార్బన్ డిజమ్ 400 గ్రాములును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల పాదులలో బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవలెను.
6 “ఆకుమచ్చ తెగుళ్ళు” నివారణకు గాను ఎకరానికి కార్బన్ డిజమ్(బావిస్టిన్) 200 గాలములు లేదా ప్రోపి కొనజోల్ (టిల్ట్) 200 గ్రా ములు లేదో..
హెక్సా కొనజోల్ (కాంటాప్): 400 గ్రాములు ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసు కొని “ఆకు మచ్చ తెగుళ్ళు” నివారణ చేసుకొని..
రైతులు అధిక వర్షాలవల్ల పంటలను కాపాడుకోవాలని రైతులకు సూచించడం జరిగింది.