బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో తెరకెక్కి యువతను ఉర్రూతలూగించనున్న’ఓ సాథియా” మూవీ లోని టైటిల్ సాంగ్ రిలీజ్
డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి.. సినీ రచయిత విజేయేంద్ర ప్రసాద్ గారి సూచనలతో.. దివ్య భావన దర్శకత్వంలో మంచి లవ్ స్టోరీతో.. తెరకెక్కిన ‘ఓ సాథియా” సినిమాలలోని మొదటి పాటను సంగీత ధర్శకుడు మణిశర్మ చేతుల మీదుగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘చిన్నదానా నీకోసం’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన మిస్తీ చక్రవర్తి హీరోహిన్ గా – ఆర్యన్ గౌర హీరోగా జంటగా నటించిన ‘ఓ సాథియా’ సినిమాను చందన కట్టా నిర్మించారు.
షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ను రచయిత విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే..కాగా ఈ సినిమాలోని మొదటి పాటను సంగీత దర్శకుడు మణిశర్మ చేతుల మీదుగా శుక్రవారం నాడు సాయంకాలం నాలుగు గంటలకు విడుదల చేశారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
మంచి లవ్ స్టోరీతో తెరకెక్కిన ఓ సాథియా మూవీ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో అట్టహాసంగా రిలీజ్ అయి యువతను థియేటర్లకు కట్టిపడేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ దివ్యభావన , హీరో ఆర్యన్ గౌరా , మ్యాజిక్ డైరెక్టర్ విన్ను , లైన్ ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ జూలూరు , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తివారి ఆవుల మొదలగు చిత్ర బృందం పాల్గొన్నారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
#OsaathiyaNewFilmSong #AryanGowra #Mishti Chakravarty #sangeetamManisharma #VijayendraPrasad #ssRajamouly