ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిన ప్రభుత్వం – లక్ష్మి నరసింహ యాదవ్
- రాజీవ్ గాంధీ భవన్ , నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ.
- తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదు – ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిన ప్రభుత్వం
- ముఖ్యమంత్రి గారూ సామాజిక ఫించన్లు పంపిణీ సరే మిగతా హామీల ఏమయ్యాయి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
- జే లక్ష్మీ నరసింహ యాదవ్ గారు కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు మరియు ఏఐసిసి మెంబర్
- ఎన్నికల కంటే ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని థాలీ బాజావో స్టీల్ ప్లేట్లతో నంద్యాల కలెక్టరేట్ దగ్గర నిరసన
నంద్యాల :- ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ గారి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం లక్ష్మీ నరసింహ యాదవ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు సూపర్ సిక్స్ పథకాలు 100 రోజులైనా అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం అని అన్నారు . నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలపడం కోసం వారు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ స్టీల్ ప్లేటు గరిటెలతో కలెక్టరేట్ దగ్గర శబ్దాలు చేస్తూ నిరసన తెలియజేశామని అన్నారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
- ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటివద్దనే లబ్దిదారులకు సామాజిక ఫించన్లు పంపిణీ చేయడం హర్షణీయం. కానీ మిగతా హామీలు అటక ఎక్కించారు
- బిసి,యస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.జులై,ఆగష్టు,సెప్టెంబర్ 3 మాసాలు గడిచిపోయాయి.అమలు కాలేదు.
- యువ గళం క్రింద నిరుద్యోగ యువతకు నెలకు 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.ఇప్పటివరకు అమలు కాలేదు.
- తల్లికి వందనం పథకం క్రింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ15,000లు ఇస్తామన్నారు.ఇవ్వలేదు.
- అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రతి రైతు కు ఏటా రు 20,000 లు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.ఇంతవరకు 20 రూపాయల సాయం కూడా చేయలేదు.
- 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ 1500 ఇస్తామన్నారు.ఇవ్వలేదు.
- ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు.చేయలేదు.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.అమలు కాలేదు.
- పైనా పేర్కొన్న హామీ లను వీలైనంత త్వరగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ
ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య , మాజీ ఉపాధ్యక్షులు బాలస్వామి , బోయ రమణ , శ్రీనివాస్ గౌడ, బి హుస్సేన్ భాష , రహ్మాన్ భాష , కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్ , కురువ రవి కుమార్ , దాట్ల శ్రీరాములు యాదవ్ , షేక్ రజాక్ భాష , నాగరాజు , మహేంద్ర , మధుసూదన్ రెడ్డి , మల్లికార్జున , రామాంజినేయులు , గుండల కిరణ్ , చబోలు సలాం , జావేద్ , అబ్రహం , షేక్ రియాజ్ , ఉస్మాన్ భాష , పసుపులేటి లక్ష్మి నరసింహ, మహబూబ్ భాష, శంసుల్ హక్ , సంజీవ్ కుమార్, డాక్టర్ వెస్లీ , మరియు మిగతా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV