బైరెడ్డి చొరవతో కదిలిన అధికార యంత్రాంగం – నీటిముంపు బాధితుల స్థానికతపై సమగ్ర ఇంటింటి సర్వే
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అరణ్యంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న సిద్దేశ్వరం, జానాలగూడెం , బలపాలతిప్ప గ్రామాల్లో బుధవారం ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వెళ్లి వారి స్థానికతపై సమగ్ర సర్వే చేపట్టారు.
సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ Dr. కె. శ్రీనివాసులును మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నీటిమునక బాధితులతో కలిసి వెళ్లి వారి కష్టాలు వినతి పత్రం ద్వారా తెలుపుకున్నారు. అలాగే మంగళవారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాధితులకు అండగా ఉండేందుకు సిద్దేశ్వరం వెళ్లేందుకు వెళ్లగా రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు సంగమేశ్వరం వద్ద ఆపి సిద్దేశ్వరం వెళ్ళవద్దని, శాంతి భద్రతల సమస్య తల్లేత్తే అవకాశం ఉందని బైరెడ్డిని ఆపారు. దీంతో బైరెడ్డి జిల్లా ప్రభుత్వం ఉన్నతాదికారుల దృష్టికి సంగమేశ్వరం నుంచే భాదితుల గోడు వివరించగా ప్రభుత్వ పరంగా బాధితులకు న్యాయం చేసేందుకు గ్రామాల్లో స్థానికంగా ఉన్న వారి వివరాలు సేకరించి వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని బైరెడ్డికి హామీ ఇవ్వడంతో సిద్దేశ్వరం వెళ్లకుండానే సప్తనదుల సంగమేశ్వరంలో శ్రీలలితా సమేత సంగమేశ్వర స్వామి వార్లకు బైరెడ్డి ప్రత్యేక పూజలు చేసి వేనుతిరిగారు.
బైరెడ్డికి జిల్లా అధికారులు ఇచ్చిన హామీ మేరకు
బుధవారం కర్నూలు ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ గీతా మహాలక్ష్మి, కర్నూలు కలెక్టరేట్ ఇరిగేషన్ AE విజయకుమార్ రెడ్డి తదితర అధికారుల బృందం సిద్దేశ్వరం, జనాలగూడెం, బలపాలతిప్ప గ్రామాల్లో పర్యటన చేస్తూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు కార్డులు అడిగి వారి స్థానికతను నిర్ధారణ చేసేందుకు సర్వే చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నామని బృందం అధికారులు చెప్పారు.