మాజీ ఎమ్మెల్యే భూమా ఔదార్యం
నంద్యాల జర్నలిస్టులకు
రూ.5లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం .
…సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో మీడియా కు ఓపి ఉచితం.
….ఇన్వెస్టిగేషన్ టెస్టులకు 50 శాతం డిస్కౌంట్ – మాజీ ఎమ్మెల్యే భూమా
నంద్యాల పట్టణంలోని 100మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు లకు రూ.5లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం తన స్వంత నిధులతో అందిస్తున్నట్లు టిడిపి నియోజవర్గ ఇంఛార్జి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. గురువారం పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఎంతో వొత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను పాలకుల తప్పులను ఎత్తిచూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టుల కృషి అభినందనీయం అన్నారు…
చాలీ చాలని జీతాలు ఇబ్బందులు ఎదుర్కొనే జర్నలిస్టులకు తన వంతుగా నూతన సంవత్సరం క్రిస్టమస్ కానుకగా వారి కుటుంబాలకు మేలు జరిగేలా ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు…రాయల్ సుందరం ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాద సాధారణ పాక్షిక అంగవైకల్యం జరిగినా భీమా వర్తిస్తుందని ఎన్నోరకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆసుపత్రి వైద్యానికి ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తందని చెప్పారు..అలాగే పట్టణంలోని సెవెన్ హిల్స్ యాజమాన్యం మారుతి కుమార్ సౌజన్యం తో ప్రతి జర్నలిస్టు కు సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో ఓ పి ఉచితం గా అందించేందుకు,,ఇన్వెస్టిగేషన్ టెస్ట్ లలో 50శాతం డిస్కౌంట్ వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు..ఇందుకోసం ముందుకు వచ్చిన సెవెన్ హిల్స్ అధినేత మరుతికుమర్ ను ఈ సందర్భంగా భూమా అభినందించారు…ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ సౌకర్యం అందుకోవాలని అవసరమైన డాక్యుమెంట్లు తమ కార్యాలయంలో అందించాలని భూమా ఈ సందర్భంగా కోరారు…కాగా జర్నలిస్టు ల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన మాజీ ఎం ఎల్ ఏ ని,సెవెన్ హిల్స్ అధినేత మారుతి కుమార్ నీ పట్టణంలోని జర్నలిస్టు సంఘ్ నేతలు అభినందించారు.