- దేవుళ్ల విగ్రహాల తలలో వజ్రాలు, బంగారం ఆశతో ద్వంశం
- ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయాలు చిన్నాభిన్నం..
- చరిత్రలుగా చెప్పే విగ్రహాలను రహస్యంగా ఎత్తుకెళ్తున్న మాపియా ముఠా
- Article by ———- సగినాల రవి కుమార్ – 8309888954
నల్లమలలో మాఫియా ముఠాలు రోజు రోజుకు మీతిమీరి పోతున్నాయని చెప్పవచ్చు. ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర గాంచిన దేవుళ్ల విగ్రహాలను గుప్తనిధుల పేరుతో ద్వసం చేస్తున్నారు. రాజులు పరిపాలించే సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో వారు నిర్మించిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి మీదుగా నల్లమల అడవిలో నుంచి శ్రీశైలం కాలినడకన వెళ్ళే భక్తులు వివిధ రూపంలో వెలసిన పురాతన దేవుళ్ల విగ్రహాలకు పూజలను కొనసాగిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మాపియా ముఠాలుగా ఏర్పడి చరిత్రలుగా చెబుకునే దేవాలయాల్లోని దేవుళ్ల విగ్రహాల తలలను ఎత్తుకొని పోయో దుండగులు ఉన్నారంటే నమ్ముతారా.. అవును నల్లమల అడవులో ఎన్నో సప్త శివాలయాలు చరిత్ర గాంచిన పురాతనమైన ఆలయాలు, ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. దేవుళ్ల విగ్రహాల తలలను ఎందుకు తీసుకెళ్తున్నారో వాటి వలస ఉపయోగం ఏమిటి అనే విషయాలపై తెలుసు కుందాం..
శ్రీకృష్ణదేవరాయుల పరిపాలనకు ముందు నల్లమలలో మెట్ల మార్గంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఇతర ప్రాంతాల నుంచి నల్లమల అటవీ మార్గంలో పాదయాత్రగా తరలి .. వెళ్లేవారు భక్తిపర్వశంతో శ్రీశైలంలో వెలసిన బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి ఆశీస్సుల కోసం వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. నల్లమలలో ఎన్నో పురాతనమైన ఆలయాలు నేటికి చరిత్రగా మిగిలాయని చెప్పవచ్చు…దాదాపుగా 200ల సంవత్సరాల క్రితం వెలసిన సప్త శివాలాయలలో మహపుణ్యక్షేత్రాలుగా అప్పటి రాజులు ఎంతో మంది దైవ భక్తితో దేవుళ్లను ప్రత్యేకంగా పూజించే వారు. చరిత్రగా చెప్పే సప్తశివాలయాల ఆలయాలు శిధిలావస్తలో ఉన్నాయి.
చరిత్రగాంచిన దేవాలయాలు కృష్ణనది పరివాహక ప్రాంతమైన ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రలో మద్యలో ప్రవహిస్తున్న కృష్ణా నది ఒడ్డు మార్గంలో కొండపై అంకాలమ్మ కోటను అప్పటిరాజు నిర్మించారు.ఈ కోటలో వినాయకుడు, నాగదేవత, శివపార్వతులు, ఇష్టకామాక్షి ఎంతో మంది దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్టింపజేశారు. దంతాల లింగమయ్య సమీపంలో భీముడు కొలువైన ప్రదేశంగా బావిస్తున్నారు. అక్కడ స్వరంగ మార్గంన శ్రీశైలంకు వెళ్లే మార్గం ఉన్నట్లు భక్తుల నమ్మకం నేటికి అక్కడా ప్రత్యేక పూజలు కొనసాగిస్తునే ఉన్నాయి. చదువుల తల్లి సరస్వతి ఆలయం కొలనుభారతి క్షేత్రం ఏకైక నల్లమలలో అడవులో వెలసింది. సప్తనదుల సంగమేశ్వరం ఆలయం, చిన్న గుమిత్తం, పెద్ద గుమిత్తం శివపార్వతుల ఆలయాలు అప్పటిరాజులు నిర్మించిన్నట్లు చరిత్ర చెబుతుంది.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
నల్లమలలో పెద్దవీరభద్రాలయం
నల్లమలలో పెద్దవీరభద్రాలయం స్వామి గుడిని ప్రతిష్టింప చేశారు. ఈ ఆలయం శిథిలావ్యవస్థలో చేరుకుంది. పెద్దనాగులూటి వీరభద్రాలయం మీదుగా భక్తాదులు పాదయాత్రగా వెళ్తారు. ఈ ఆలయంలోనే ఎంతో చరిత్ర ఉన్న దేవుని విగ్రహాం తలను దుండగలు ఎత్తుకెళ్లిన్నట్లు మరో సమాచారం. తిరుమత తిరుపతి తరహాలో నల్లమలలో మరో తిరుమల కొండలో వెలసిన వెంకటేశ్వరిస్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం భక్తాదులు పూజలు చేసుకునేందుకు వెళ్తారు. ఈ తిరుమల కొండ ప్రాంతంలో ఉన్న ఆలయంలో పురాతనమైన విగ్రహాలను ద్వంశం చేసి శిథిలావ్యవస్థకు తీసుకెళ్లారు. నల్లమలలో రుద్రకోటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రతిష్టానాత్మకంగా శివపార్వతుల కళ్యాణం ప్రతి మహశివరాత్రికి పండుగల నిర్వహించుకుంటారు. ఎన్నో పురాతన మైన ఆలయాలను ద్వంశం చేసి చరిత్రగా ఉన్న దేవుళ్ల విగ్రహాల తలను ఎత్తుకెళ్తున్న మాపియా ముఠాను అరికట్టే విదంగా భద్రత కల్పించాలంటూ భక్తులు కోరుతున్నారు. ఈ ప్రదేశాలలో అటవీశాఖ ఉండడంతో కొంత నిషేదమైన్నప్పటికి గుప్తనిధుల వేటగాళ్లు అటవీశాఖ అధికారుల కన్నులు కప్పి నేటికి ద్వంశం చేస్తునే ఉన్నారు. https://nstr.co.in/nallamala-jungle-camps-bairluty/