నల్లమల లో… పెద్ద పులి సంతతి పెరుగుతుందా? తరుగుతుందా…!
పెద్ద పులుల మే టింగ్ సమయంలో అటవీశాఖ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఒక ఆడ పులి ఎన్నిసార్లు జన్మనిస్తుంది..?
ఇవి ఎ ప్రదేశాలలో సంతతి ఉత్పత్తి పెంచుకుంటాయి
ఎన్. టి. సి. ఏ. పెద్ద పులుల సంతతి పై సంరక్షణపై జీవోలు విడుదల చేశారా
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో పెద్ద పులుల సంరక్షణ మరియు పులుల సంతతి పెరుగుతుందా.!
లేక తరుగుతుందా..? పెద్దపులి మనగడ వాటి స్థితిగతులు అవి ఏ కాలంలో సంతతి పెంచుకుంటాయి వాటి కలయిక ఎప్పుడు నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది అనే విషయాలపై…..
దేశంలోనే పెదపులుల అభయరణ్యంగా ప్రసిద్ధిగాంచిన నల్లమల అడవిలో పులులు ఎందుకు వరుసగా మృత్యువాత పడుతున్నాయి.
వాటికి కారణాలు ఏమిటి తెలియాల్సి ఉన్నప్పటికీ కొన్ని పులులు వయసు మీద పడడంతో అనారోగ్యం కారణాలవల్ల మృత్యు ఘోష వినిపిస్తున్నాయి.
మరోవైపు జాతీయ రహదారి గుర్తింపు పొందిన ఎన్ హెచ్ 340 c రహదారి మీద వాహనాల ప్రమాదాలకు పులులు మృతిచెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి .
ఇదిలా ఉంటే నల్లమల్ల పెద్దపులుల అభయారణ్యంలో శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు పరిధిలో దాదాపుగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో 60. కి పైగా పెద్ద పులులు కూన పిల్లలు ఉన్నట్లు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్దపులుల యొక్క ఘనంగాలను ప్రకటించడం జరిగింది.
నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పెద్ద పులుల సంతతి అధికంగా పెరుగుతుందని ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖ అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి.
వాస్తవానికి పెద్ద పులుల సంఖ్య నల్లమల అటవీ ప్రాంతంలో పెరిగిందా..? లేక తరుగుతుందా అనే వాస్తవ విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది
- ఆడ పులి మగ పులి ఏ కాలంలో సంతతిని పెంచుకుంటాయి
- దేశంలోనే పులుల సంరక్షణ ఆత్మకూరు అటవీ డివిజన్
వర్షాకాలం ముగింపు సమయంలో చలి చలిగా వేడివేడిగా ఉన్న ప్రదేశంలో ఒక ఆడ పులి మగ పులి కలిసి వాటి యొక్క కలయికను జరుపుకోవడం జరుగుతుంది.
ఇవి అరుదైన ప్రదేశాలలో వీటిని సంబోధించుకుంటాయి ఒక ఆడ పులి గర్భం దాచింది అంటే దాదాపు 2 నుంచి 4 పులుల వరకు జన్మనిస్తుంది.
పెద్దపులి సంరక్షణపై అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగానే వాటి యొక్క ఉనికిని గుర్తిస్తే కూన పులి పిల్లల్ని సంరక్షణ చేసుకోవచ్చు.
ఈ ఆడ పులి దాని జీవితకాలం 20 సంవత్సరాల పైగా జీవిస్తుంది ఇది కేవలం 1 నుంచి3 సార్లు మాత్రమే తమ పిల్లలకు జన్మనిస్తుంది.
ఒకసారి మగ పులి ఆడపులితో కలయిక జరిగిందంటే అది మళ్లీ అటువైపు తిరిగి చూడదని అటవీ శాఖలో ఐఎఫ్ ఎస్ నుంచి ఎస్ ఎఫ్ ఎస్ స్థాయి అధికారుల వరకు చర్చించుకుంటున్నారు.
పెద్ద పులుల సంతతి ప్రతి సంవత్సరం
వీటి యొక్క కలయికతో ఆరు సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుంది ఇవి అడవిలో బయలు ప్రదేశం సుతిమెత్తనైన గడ్డి ప్రదేశాలు ఉండాలి.
వాతావరణం చల్లగా వేడిగా ఉండే చోట వీటి యొక్క కలయిక జరుగుతుందని ఎన్ టి సి ఏ అధికారులు గుర్తించారు పెద్ద పులుల సంతతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాలలో వీటి యొక్క సంతతిని సంబోధించు కుంటాయి.
- నల్లమలలో పెద్దపులులు ఎందుకు మృత్యు ఘోష
జాతీయ జంతువుగా గుర్తింపు పొందిన పెద్దపులి నల్లమల అడవి దేశానికి ఆదర్శంగా నిలిచాయి ప్రతి సంవత్సరం ఏదో ఒకచోట పెద్దపులులను మృత్యు ఘోష వెంటాడుతూనే ఉంది అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నో పెద్దపులులు మృతి చెందిన సంఘటనలు కళ్ళ ముందరనే చూస్తున్నాం అయితే వీటిని సంరక్షణ చేయాల్సిన అధికారులు మాత్రం పెద్దపులి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వీటి సంరక్షణ కోసం లక్షల రూపాయల నిధులు అటవీ శాఖఆధ్వర్యంలో ఖర్చు చేయనున్నారు గత నెల రోజుల క్రితం ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారిలో ఓ పెద్దపులి రోడ్డుకు అడ్డంగా వెళ్తున్న విషయాన్ని గమనించిన వాహనదారులు ఆ పులిని చూసి అక్కడే నిలిచిపోయారు గత సంవత్సరంలో ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఓ రేంజ్ లో పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే ఇలా అడవిలో ఎన్నో పులులు మృతి ఘోష వినిపిస్తూనే ఉన్నాయి
- దేశంలో పెద్దపులుల సంరక్షణ కోసం ప్రత్యేక ఆదేశాలు
దేశంలో పెద్ద పులుల సంరక్షణ కోసం ఎన్ టి సి ఏ బృందం ప్రత్యేక ఆదేశాలు అటవీ శాఖ ఉన్నతాధికారులకు 2018 సంవత్సరంలో ఆదేశాలు జారీ చేశారు అడవుల్లో పెద్దపులుల కలయిక ఎప్పుడు జరుపుకోవాలి అని ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఐఎఫ్ ఎస్ అధికారి నళిని మోహన్ చీప్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైడ్ లైఫ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు 2015 సంవత్సరంలో ఎన్ టి సి ఏ బృందం ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అటవీశాఖ అధికారులు అమలు చేస్తున్నారు
- వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగు టెరాన్ వివరణ
నల్లమల అడవి ప్రాంతం ఆత్మకూరు డివిజన్ వన్య ప్రాణి విభాగంలో పెద్దపులుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు పెద్దపులుల సంరక్షణపై సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు ప్రస్తుతం వన్యప్రాణి డివిజన్ పరిధిలో పెద్ద పులుల సంరక్షణ పై ప్రత్యేక నిఘా వర్గాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు..
#NagarjunasagarSrisailamTigerReserveForest #nallamalaTiger #nallamalaForrest #nallamalaPululu