- చదువు లేకపోవడం వల్లే చెంచుల వెనుకబాటుకు కారణం
- ఐ టీ డి ఏ ను ప్రక్షాళన చేద్దాం
- చెంచులు కూడా నాగరికతను అలవరసుకోవాలి
- నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చదువు లేకపోవడం వల్లే చెంచుల ( గిరిజనుల ) వెనుకబాటుకు కారణమని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయినా చెంచు గిరిజన కుటుంబాల్లో ఏమాత్రం మార్పు కనపడలేదని, ఐ టీ డి ఏ ను ప్రక్షాళన చేసి చెంచులకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చూస్తామని, చెంచు లలో ( గిరిజనులలో ) కూడా మార్పు ఎంతో అవసరమని, ఆధునిక ప్రపంచం వైపు చెంచులు నడవాల్చిన అవసరం ఎంతైనా ఉందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జిల్లా అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట చెంచుకాలనీలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పర్యటించారు.
Plz Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1
ఈ సందర్బంగా ఆమె చెంచు గిరిజనుల సమస్యలు ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు.
నంద్యాల జిల్లా పరిధిలోని నల్లమల అరణ్యం, మైధాన ప్రాంతాల్లో 42 చెంచు గూడెం లలో (గిరిజనులు ) చెంచులు జీవనం సాగిస్తున్నారని, చెంచుల ( గిరిజనుల ) అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు ఖర్చు చేస్తున్నాయని, అయినా ఇంకా వెనుకబాటు ఎందుకని, చెంచు పిల్లలు చదువు కుంటే తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తారని ఆమె అభిప్రాయం పడ్డారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
కనీస వసతులకు చెంచులు దూరంగా బ్రతకడం బాధేస్తోందని, అధిక సంతానం కూడా చెంచుల వెనుకబాటుకు ఒక కారణం అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
చెంచు గూడెంలలో కనీస వసతులైన మహిళలకు వ్యక్తిగత మరుగు దోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో సేవల విస్తరణ, పక్కా గృహలతో పాటు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంద విద్య చెంచు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటామని, చెంచు మహిళలు కూడా మార్పుకు సహకరించాలని, తమ బిడ్డలను చదివించుకోవాలని,
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, పొదుపు గ్రూప్ లలో గిరిజన మహిళలు చేరి ఆర్ధికంగా బలోపేతం కావాలని ఎంపీ శబరి కోరారు.
చెంచు గూడెంల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పక్కదారి పట్టిన, దుర్వినియోగం అయినా సంబంధిత ఐ టీ డి ఏ శాఖ,
ఇతర ప్రభుత్వ శాఖల అధికారులపై కఠిన చర్యలు ఉంటాయాని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు.
అనంతరం వేంపెంట లోని హెల్త్ సెంటర్, అంగన్వాడీ సెంటర్లను ఎంపీ తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి. వేంపెంట మాజీ సర్పంచ్ గాండ్ల రామసుబ్బమ్మ,
టెలికామ్ సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, కురువ వెంకటేశ్వర్లు, వీరాపురం శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.