గర్జన గాండ్రింపుల తో సీమ కి ఒరిగేది ఏమీ లేదు – విద్యార్థి సమాఖ్య టి ఎన్ ఎస్ ఎఫ్

001.jpg

గర్జన గాండ్రింపుల తో సీమ కి ఒరిగేది ఏమీ లేదు

రాయలసీమ ను రతనాల సీమ గా అభివృద్ధి చేసి న్యాయం చెయ్యమంటే అక్రమ అరెస్టుల

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలు

ఈ రోజు 05-12-2022 నాడు కర్నూలు లో రాయలసీమ గర్జన లో బాగంగా గర్జన ను ఎక్కడ అడ్డుకుంటారు అని ముందస్తుగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టి ఎన్ ఎస్ ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామాంజినేయులు ను ఐ టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ జి తిలక్ ను కర్నూలు లో సి క్యాంప్ నందు అక్రమంగా అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కర్నూలు జిల్లా టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు శ్రీ రామాంజినేయులు మరియు ఐ టీడీపీ జిల్లా జిల్లా అధ్యక్షులు శ్రీ జి తిలక్ మాట్లాడుతూ రాయలసీమ కు ఎం న్యాయం చేశారని గర్జన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాయలసీమ కు మూడు సంవత్సారాలు గా గత టీడీపీ హయాంలో 25000 వేల కోట్ల పెట్టుబడులను బెదిరించి వెనక్కి పంపేశారు అని సీమ లో ఉన్న కంపెనీలు జాకీ, అమర రాజ కియా,టైటాన్,రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ అనేక కంపెనీలు పక్క రాష్ట్రాల కు పారిపోయాయని తెలిపారు.ఈ మూడున్నర సంవత్సరాల లో ఎక్కడ ఒక్క ఉద్యోగం కల్పించలేక పోయారని పెండింగ్ లో ఉన్న సాగు నీటి తాగు నీటి ప్రాజెక్టుల జోలికి పోలేదని నేటికీ రాయలసీమ లో కరువు వలసలతో సీమ ఎడారి గా తయారు అవుతున్న పట్టించుకోలేదని తెలిపారు.విశ్వ విద్యాలయాల కు నిధులు మంజూరు చెయ్యక అభివృద్ధి చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని అధికార పార్టీ మూడు రాజ దానుల పేరుతో కాలయాపన చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతు సుప్రీం కోర్టు లో ప్రభుత్వ న్యాయ వాది స్వయంగా అమరావతి నుండి హై కోర్టు ను తరలించే ఆలోచన లేదని ఒప్పుకోవడం తో రాయలసీమ కు తీవ్ర అన్యాయం చేశారని ప్రజలు గ్రహిస్తున్నరని తెలిపారు.ఇకనైనా రాయలసీమ కు న్యాయం చెయ్యాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top