అధికారుల అలసత్వానికి నిలువెత్తు నిదర్శనం
జగనన్న కాలనీలో జరిగిన కబ్జాలపై చర్యలు శూన్యం
అక్రమార్కులకు అడ్డుకట్ట వేసే నాథుడే లేరా
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం,ఇబ్రహీంపట్నం
జగనన్న కాలనీలో జరుగుతున్న కబ్జా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు .గత కొంతకాలంగా జగనన్న కాలనీలోని సిపిల్యాండ్ ను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసి అందులో దర్జాగా వ్యాపారం చేస్తూ ఉన్నా కూడా సంబంధిత శాఖల అధికారులు వారికి ఏమి పట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు అదే (కబ్జా) విషయాన్ని కొందరు స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో అధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారు అనే భావన కలిగి వారు కూడా మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. పలుమార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా,కబ్జా చేసింది కళ్లముందు కనపడుతున్నా ఎందుకు అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవడం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.అధికారులు అలసత్వానికి అసలు కారణం ముడుపుల మహిమా? లేక ఆమ్యామ్యాలకు అలవాటు పడి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారా? అనేది కాలనీ వాసుల భావన !
గత కొన్ని రోజులుగా ఈ కబ్జా విషయమై పత్రికా విలేఖరులు సైతం కధనాలు రాస్తున్నా కూడా అధికారులలో ఇసుమంత చలనం కూడా రావడం లేదంటే అసలు రహస్యం ఏమిటో వేచి చూడాలి మరి..