కుందూనది మట్టి-ఇసుక పై అక్రమార్కుల డేగ కన్ను

Illegal sand mining Kundunadi

Illegal sand mining in Kundu nadi nandyala

అధికార పార్టీలకు ఆదాయ వనరుగా కుందూ..

AP : జీవనదిగా పేరొందిన కుముద్వి నిపై మట్టి మాఫియా పంజా విసి రింది. కుందూలోని మట్టి, ఇసుక తరలింపుకు అక్రమార్కులు భారీ వ్యూహాన్ని రచించారు.

అక్రమ సంపాదనే లక్ష్యంగా కుందూపై అక్రమార్కుల డేగ కన్ను పడింది. కుందూనది నుంచి మట్టి, ఇసుకను తరలిం చేందుకు నలుదిక్కులా రహదారుల ఏర్పాటు జరిగిపోయింది.

ఒక చోట రహదారి ఏర్పాటుపై వివాదం రగులుకోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. భారీ ప్రొక్లైన్ కుందూలో మొహరిం చింది. అధికార పార్టీలకు కుందూ.. ఆదాయ వనరుగా మారిపోయింది.

ఎన్నికలకు ముందు కుందూ అక్రమ తవ్వకాలపై అప్పటి టీడీపీ ఇన్చార్జి ఫరూక్ ఘాటైన వ్యాఖ్యల తో అధికార పార్టీ వైసీపీపై విరుచుక పడ్డారు.

ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీకి అక్రమ త్రవ్వకాలు ఆయుధంగా మారనున్న నేపథ్యంలో.. ఈ కథనం

అక్రమ సంపాదనకు భారీ వ్యూహం

నంద్యాల పట్టణ శివారులోని కుందూ నదిలో మట్టి, ఇసుకకు మంచి గీరాకి ఉంది. ఇసుకను ఇంటి నిర్మాణాలకు వినియో గిస్తారు.

మట్టిని పొలాలతోపాటు ఇసుక బట్టీలకు ఉపయోగిస్తారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కనుసన్నల్లో కుందూలో అక్రమ త్రవ్వకాలు యద్దేచ్చగా సాగుతాయి.

ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నా శిల్పా వర్గీయుల చేతుల్లోనే అక్రమ త్రవ్వకాలు సాగుతున్నాయని అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఎన్నో సార్లు ఆరోపించారు.

Also Read నల్లమలకు అడవి దున్న

సార్వత్రిక ఎన్నికల్లో అధికార మార్పు అక్రమ త్రవ్వకాల పై ప్రభావాన్ని చూపాయి. శిల్పా వర్గీయులు అక్రమ త్రవ్వకాలను నిలిపి వేశారు.

ఇదే సమయంలో అక్రమార్కులు కొందరు ఒక బృందంగా ఏర్పడి కుందూనదిపై డేగ కన్ను వేశారు. కుందూనదిలోని మట్టి, ఇసుకకు బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉండటంతో అక్రమార్కు లు కుందూనదిపై పంజా విసిరేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

మట్టి తరలింపుకు రహదారుల ఏర్పాటు

కుందూనది పరివాహక ప్రాంతాలలో నలువైపుల నుంచి ఇసుక, మట్టిని తరలించేందుకు భారీ వ్యూహాన్ని రచించారు. నాలుగు వైపుల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.

ఒక వైపు రహదారి నిర్మాణంపై భూ యజమానితో వివాదం తలెత్తడంతో ఆ వైపు రహదారి నిర్మాణాన్ని. నిలిపి వేశారు. ప్రస్తుతం కుందూనదిలో భారీ ప్రొక్లైన్ను ఏర్పాటు చేశారు.

గత కొద్దిరోజుల నుంచి అడపదడప వర్షాలు పడుతుండటంతో ఆ ప్రాంతంలో భూమి తడిగా ఉండటంతో అక్రమార్కులు పలు మార్గాలపై అన్వేషణ చేస్తున్నారు.

గతంలో అక్రమ త్రవ్వకాల పై ఫరూక్

ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ కనుసన్నల్లో అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించిన అప్పటి టీడీపీ ఇన్చార్జి ఫరూక్ ఆ ప్రాంతాన్ని సందర్శించి

అధికార వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సూర్య దినపత్రిక అక్రమ త్రవ్వకాలపై వార్తాకథనాన్ని అందించింది. ఎన్నికల సమయం కావడంతో

అధికారులు అక్రమ త్రవ్వకాలపై నిషేదం విధించారు. ఇప్పుడు అక్రమార్కుల కన్ను కుందూనదిపై పడింది. విలువైన ఖనిజ సంపదను తరలించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

Buy it a good pen drive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top