ధర్మవరం (సత్యసాయి జిల్లా)
డ్రైవర్లను జైలు పాలు చేసే హిట్ అండ్ రన్ చట్టల రద్దుకై ఈనెల 16 – 02- 2024న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
స్థానిక సిఐటియు కార్యాలయంలో ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశంలో ఏపీరైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న. స్థానిక సీఐటీయూ ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్. ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్ర నాయకులు S.రఫీ మాట్లాడుతూ
దేశంలోనే అసంఘటిత రంగాల్లో అతిపెద్ద రంగం రవాణా రంగం ఈ రంగంలో ఆటోలు మొదలుకొని భారీ వాహనాలు. ప్రజా సరుకు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు వాహనాలు నడపడం వారి వృత్తిగా చేసుకొని వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు డ్రైవర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించడం లేదు
అయితే జరుగుతున్న ప్రమాదాలకు వాహన డ్రైవర్లే కారణమంటూ బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇప్పటికీ అమలు అమలవుతున్నందున ప్రమాదం చేసిన డ్రైవర్లకు శిక్ష పడిన వెంటనే బయటికి వస్తున్నారని ఇది సరికాదని ఈ చట్టాలను తక్షణమే మార్చాలని కేంద్రంలో ఉన్నటువంటి బిజెపిప్రభుత్వం గత డిసెంబర్ 21/2023 తేదీన భారత న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింప చేసుకొని రాష్ట్రపతి ఆమోదం పొంది సెక్షన్ 106/1 ప్రకారం ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కు 10 సంవత్సరములు జైలుశిక్ష. ఐదులక్షల రూపాయలు/- జరిమానా కట్టాలని 106/2 ప్రకారం ప్రమాదం చేసిన డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళినట్లయితే హిట్ & రన్ పేరుతో పది సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు జరిమానా విధించే విధంగా దుర్మార్గమైన చట్టాన్ని రూపొందించారు ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల ఆందోళనకు గురైన డ్రైవర్లు మెరుపు సమ్మె చేయడం వల్ల
తాత్కాలికంగా ఈ చట్టాన్ని ఆపడం జరిగింది. కానీ రద్దు చేయలేదు.
ఒకసారి అమలైన చట్టాన్ని తిరిగి ఎప్పుడైనా అమలు చేయవచ్చు. ఈచట్టం అమలు అయితే డ్రైవర్ల జీవితాలు అధోగతి పాలు కావడం ఖాయం. అదేవిధంగా జరిమానాలు చెల్లించే పరిస్థితిలో డ్రైవర్లు లేరు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా.
ప్రమాదాలు కేవలం డ్రైవర్ల వల్లనే జరుగుతున్నాయి అన్న నేపంతో డ్రైవర్ల పై ఇలాంటి భారీ శిక్షలు జరిమానాలు విధించడం సరియైనది కాదు అని. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ ఫెడరేషన్ (AIRTWF) భవిస్తోంది.
అమెరికా. బ్రిటన్ లాంటి తదితర దేశాలలో రోడ్డు ప్రమాదాలపై
ప్రాథమిక విచారణకు పోలీసులతో పాటు నిపుణుల కమిటీ ఉంటుంది.
నివృక్షపాతంగా ప్రమాదాలకు వాస్తవ కారణాలు పరిశీలించాకే వాటి ఆధారంగా చార్జిషీటు దాఖలు అవుతుంది.
దీని కనుగుణంగా శిక్షలు ఉంటున్నాయి.
వీటన్నింటినీ వదిలి వేసి కేవలం డ్రైవర్లనే. ముద్దాయిలను చేస్తే ప్రమాదాలు తగ్గవు. పైగా శిక్షలకు భయపడి డ్రైవర్ వృత్తికి రావడానికి ఎవరు అంగీకరించడం లేదు.
ప్రమాదాలకు అసలు కారణాలు పరిశీలించి సమస్యను పరిష్కరించి ప్రజలలో రహదారి భద్రత నియమాల పట్ల అవగాహన కల్పించడం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
అందుకు చైతన్యవంతమైన ప్రజలే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అందుకు అందరం సిద్ధం కావాలి.
అలాగే రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి డ్రైవర్లు అందరూ ఏకం కావాలి ఈ కొత్త చట్టాల రద్దుకై. సభలు. సమావేశాలు. సంతకాల సేకరణ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని అన్నారు
ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా రవాణారంగం సమ్మె చేయాలని
ఆల్ ఇండియా కమిటీ (AIRTWF) పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.,.
ఈ కార్యక్రమంలో
సిఐటియు ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్. ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్ర నాయకులు S. రఫీ.
ఏపీరైతు సంఘం జిల్లాఅధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న. పట్టణ ఆటో యూనియన్ నాయకులు
తొండ మాల బాబు. షేక్ రఫీ. రవి. రాము. సిఐటియు నాయకులు బాలాజీ. హరి. పాల్గొనడం జరిగింది