రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ..ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమా చూసిన తర్వాత సీనియర్ సినీ నటుడు సుమన్ సైతం సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా కల్కి సినిమా గురించి సుమన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా తాను చూసానని అయితే ఈ సినిమా మొత్తం చాలా స్లోగా సాగుతుందని తెలిపారు.
సెకండ్ హాఫ్ చాలా బాగుందని తెలిపారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ను సరిగ్గా చూపించలేదని ఈయన తెలియజేశారు. సెకండ్ హాఫ్ మొత్తం అమితాబ్ ను హైలెట్ చేశారని ఈయన వెల్లడించారు.
ఇకపోతే ప్రభాస్ గెటప్ గురించి కూడా పలు విషయాలు తెలిపారు. ప్రభాస్ కి ఏదో షీల్డ్ పెట్టి అలాంటి గెటప్ వేశారు. కానీ నిజానికి ఆయన చాలా మంచి ఫిజిక్ కలిగి ఉన్నారు. తనని రియల్ గా ఎక్కడైనా చూపిస్తారేమో అని ఎదురు చూశాను, కానీ అలా చూపించలేదని తెలిపారు. ఇక ఈ సినిమా రన్ టైంలో అరగంట సినిమాని ఎడిట్ చేయొచ్చని ఈయన తెలిపారు. ఆ బాలీవుడ్ అమ్మాయి పాత్ర అనవసరం అని తెలిపారు.
ఇక ఈ సినిమాలో మీరు కూడా ఏదైనా గెస్ట్ పాత్రలో లో కనిపించాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురు కాగా ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ సినిమాలో ఎంతోమంది గెస్ట్ పాత్రలలో నటించారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు కానీ ఒక పాత్ర చేసాము అంటే అది ప్రేక్షకులకు గుర్తు ఉండాలి తప్ప ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం గెస్ట్ పాత్రలను పెట్టకూడదు అంటూ సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.