నల్లమల అడవుల్లో…గుప్తనిధుల వేట..!

Gupta Nidhulu in Nallamala Forest

Gupta Nidhulu in Nallamala Forest

AP; నల్లమల అడవుల్లో…గుప్తనిధుల వేట..!

మూడు రోజుల క్రితం ఆత్మకూరు రేంజ్ లో వేటగాళ్లను పట్టుకొని వదిలేసిన అటవీ శాఖ సిబ్బంది

అడవిలో పురాతనమైన ఆలయాలలో అజ్ఞాత వ్యక్తులు తవ్వకాలు

నల్లమల అడవుల్లో నిజంగా గుప్తనిధులు ఉన్నాయా..?

ఈ విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్న ఆత్మకూరు రేంజర్

రాజులు రాజ్యాలు ఏలిన నల్లమల్ల అడవుల్లో ప్రసిద్ధిగాంచి చరిత్రగా చెప్పుకునే ఎన్నో పురాణతమైన ఆలయాలు నల్లమల అడవుల్లో వెలిశాయి.

శతాబ్దాల కాలం నుంచి రాజులు పరిపాలించిన కోటలు దేవాలయాలు నల్లమల్లలో ఎన్నో ఉన్నాయి. దేశంలోనే జ్యోతిర్లింగాలలో ఒకటైన..

శ్రీశైలం పుణ్యక్షేత్రం పరిధిలో అడవుల్లో ఎన్నో సప్త శివాలయాలు ఉన్నాయి పాండవులు వనవాసం చేసిన ఆనవాలు నేటికీ చెక్కుచెదరలేదు..

నల్లమల అడవుల్లో ఈ ఆలయాలలో గుప్తనిధులు ఉంటాయని అపోహలతో ఎన్నో చరిత్ర ఉన్న ఆలయాలు తవ్వకాల పేరుతో శిథిలం చేసే విధంగా కొన్ని ముఠాలు..

నల్లమల్ల అడవుల్లో ప్రవేశించి గుట్టు చప్పిడి కాకుండా తవ్వకాలు జరిపేందుకు వెళ్తున్నారు నల్లమల అడవుల్లో నిజంగా…గుప్త నిధులు ఉన్నాయా..?

అడవుల్లో ఎన్నో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో రాజులు రాజ్యాలు ఉన్న ప్రాంతాలలో…

గుప్తనిధులు దాగి ఉంటాయని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచిన ఆలయాలను..

శిథిల వ్యవస్థలో తీసుకువెళ్తూ నిధుల పేరుతో వేటగాళ్లు ధ్వంసం చేస్తున్నారు గతంలో ఈ విషయంపై పలుమార్లు పత్రిక ప్రకటనల చేత ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

కృష్ణానది తీరంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఓ కోటను నిర్మించారు ఆ కోటలో వజ్రాలు బంగారు ధనం దాగి ఉందని ఇష్టానుసారంగా…

ఆ కోటలో తవ్వకాలు జరిపి ఎంతో మహిమ గల అమ్మవారి అంకాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొన్ని సందర్భాలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గుప్తనిధుల వేటగాళ్లు..

Also Read నల్లమల అడవులను కాపాడడానికి రాబోతున్న గజరాజులు

పరిమారులు ఎక్కడ ఘర్షణ పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆత్మకూరు రేంజిలో గత మూడు రోజుల క్రితం పాత మాడుగుల సమీపంలో..

దంతాల లింగమయ్య అనే అడవి ప్రదేశంలో గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు గుప్తనిధులు తవ్వినట్లు సమాచారం అయితే అడవిలో ప్రవేశిస్తే..

కఠినమైన చట్టాలు అమలు చేస్తామని గొప్పగా చెప్పే అటవీశాఖ సిబ్బంది తప్పు చేస్తే ఎలా సమాచారం తెలిసిన మౌనం పాటించి ఎవరికి తెలియని..

నటిస్తున్న అటవీ శాఖ కింది స్థాయి సిబ్బంది ఉన్నత అధికారులని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని మరో సమాచారం.

ఏది ఏమైనప్పటికీ ఇంటికి కన్నం వేసేవాడితో పని ఏమిటి అనే చందంగా మారిందని చెప్పవచ్చు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో..

నల్లమల్ల అడవుల్లో ఎన్నో పురాతనమైన ఆలయాలు చరిత్రగా ఉన్న సప్త శివాలయాలు ఉన్నాయి చదువుల తల్లి సరస్వతి ఆలయమైన..

నల్లమల్ల అడవుల్లో ఎన్నో పురాతనమైన ఆలయాలు

కొలనుభారతి పుణ్యక్షేత్రం పరిధిలో గుప్తనిధుల వేటగాళ్లు తవ్వకాలు జరిపిన సందర్భాలు ఆనవాళ్లు ఇప్పటికీ అటవీ శాఖ అధికారులకు కలకట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి.

మరోవైపు చిన్న గుమ్మితం పై గుమితం పరిధిలో గుప్తనిధుల తవ్వకాలు జరిపేందుకు వేటగాళ్లు పదేపదే అడవిలోనే మక్కం చేశారు.

మరోవైపు ఇంద్రేశం పంట పొలాల సమీపంలో వీరభద్ర స్వామి ఆలయాన్ని నామరూపం లేకుండా చేసిన ఘనత గుప్తనిధుల వేటగాళ్లకే దక్కిందని చెప్పవచ్చు

అక్కడ కేవలం రాజులు పరిపాలించే పాలనలో కేవలం కోనేరు కోనేరు బావి నిర్మించిన రాతి రాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయని చరిత్ర చెబుతుంది.

మా కులదైవమైన వీరభద్ర స్వామి ఆలయానికి పూజలు చేసుకునేందుకు కరువయ్యామని పలువురు భక్తాదులు చర్చించుకోవడం విశేషంగా మారింది.

ఇదిలా ఉంటే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా ప్రతి సంవత్సరం ఇతర రాష్ట్రాల నుంచి దండోపదండాలుగా తరలి వెళ్తుంటారు.

కట్టమైన నల్లమల అడవుల్లో నాగులూటి వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో లేపాక్షి నంది విగ్రహాన్ని వజ్రాలు ఉన్నాయని అనుమానాలతో నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

కేవలం తల భాగంలో కుడి వైపు ఉన్న నంది విగ్రహం అన వాళ్లు మాత్రమే కనిపిస్తాయి ఇదిలా ఉంటే మెట్ల పైకి వెళ్లే ప్రదేశంలో కింది భాగంలో గతంలో..

అటవీశాఖ పేరు మోసిన అధికారిని గుప్తనిధుల వేటలో కీలకంగా వ్యవహరించిన తీరు నేటికీ ఆత్మకూరు ప్రజలు మరువలేదు.

మరోవైపు రుద్ర కోటేశ్వర స్వామి ఆలయ పరిధిలో గుప్తా నిధుల వేటగాళ్లు అడవిలో గుప్తనిధుల వేట ఏదో ఒకచోట కొనసాగిస్తూనే..

ఉన్నారని ఆరోపణలు అధికంగా వెలువడుతున్నాయి నల్లమల్ల అడవుల్లో గుప్తనిధుల పేరుతో చరిత్ర ఉన్న ఆలయాలను ధ్వంసం చేసే విధంగా…

వేటగాళ్లు ముందుకు వెళ్తున్నారని మరో సమాచారం కఠినమైన అటవీశాఖ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ మరి వీరికి సహకరిస్తున్న..

ఇంటి దొంగలు ఎవరు అనే సందేహాలు ప్రజల్లో నేటికీ అలాగే మిగిలి ఉన్నాయి చరిత్రలు చెప్పే ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఎన్నో..

Also Read Brand: Footjoy 34Footjoy DryJoys Double Canopy Tour Umbrella – 68″ Size

ఉన్నప్పటికీ మరికొన్ని ఆలయాలను నాటి నుంచి నేటి వరకు పురాణతమైన ఆలయాలను ధ్వంసం చేస్తూనే వెళ్తున్నారు పట్టుకున్న వేటగాళ్లను..

వదిలిపెట్టడంలో కీలకమైన సమాచారం ఉన్నతాధికారుల చేరవేయడంతో ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అధికారులు కంగారు పడిపోతున్నారు.

గుప్తనిధుల వేటగాళ్లను పట్టుకున్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేపడతాం…

ఆత్మకూరు రేంజి పరిధిలో గత మూడు రోజుల క్రితం పాత మాడుగుల సమీపంలో దంతాల లింగమయ్య అనే అటవీ ప్రదేశంలో..

పాండవులు వనవాసం చేసిన చరిత్ర అక్కడ అనవాలు చెబుతుంది గత మూడు రోజులు క్రితం రాత్రి గుట్టు చప్పిడి కాకుండా కొందరు అజ్ఞాత వ్యక్తులు..

గుప్తనిధులు తవ్వేందుకు అటవీ లోకి ప్రవేశించిన విషయాన్ని కిందిస్థాయి అటవీ శాఖ సిబ్బంది తెలుసుకొని అక్కడ ఉన్న కొందరిని గుప్తనిధుల ..

వేటగాళ్లను పట్టుకొని వారి వద్ద నుంచి మామూలు వసూలు చేసి వదిలిపెట్టినట్లు గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు .

ఈ విషయంపై ఆత్మకూరు రేంజర్ పట్టాభి దృష్టికి ఆంధ్రప్రభ తెలుగు దినపత్రిక వివరణ తెలుసుకునేందుకు త్వరగా నాకు ఇంతవరకు ఈ విషయం తెలియదు.

ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్

ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారణ చేస్తానని ఆత్మకూరు రేంజర్ తెలియజేశారు

ఈ విషయంపై ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగ్ తెరాన్ ను వివరణ కోరగా…

నల్లమల లో గుప్తనిధులు తవ్యారాన్ని సమాచారం మాకు ఇంతవరకు తెలియదని అన్నారు ఈ విషయంపై న్యాయమైన విచారణ చేసి సిబ్బందిపై..

కఠినమైన చర్యలు తీసుకోక తప్పదని శనివారం ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగ్ తెరాన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top