దొంగలించిన ఒక తులం బంగారు గొలుసు , ఒక కత్తి, ఒక కత్తెర , ఒక సెల్ ఫోన్ స్వాధీనం.
కర్నూల్ నగరం జయరాం నగర్ లో డిసెంబర్ 1 2025వ తేదీన ఉదయం 11 గంటలకు ధనలక్ష్మి నగర్ కు చెందిన దేవమ్మ వయసు 67 సంవత్సరాలు రేషన్ షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఒక గుర్తు తెలియని మహిళ బుర్కా వేసుకొని నుండి వృద్ధురాలికి వెనుకవైపుగా వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాగి ఆమెను కింద పడద్రోసి ఆమె గొంతు పై కాలు పెట్టి ఆమె బంగారు గొలుసును తీసుకొని అక్కడినుండి పారిపోయినట్లు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు మూడవ పట్టణ సీఐ శేషయ్య కేసు నమోదు చేశారు .
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్నూలు పోలీసులు కర్నూలు ఎస్పి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పి శ్రీ బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కర్నూలు త్రి టౌన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నేరం జరిగిన 24 గంటల లోపే ఈరోజు ఉదయం ముద్దాయి జొహరాపురం కు చెందిన యాస్మిన్ గా గుర్తించి ఆమె బంగారు గొలుసును నందికొట్కూరులో అమ్ముకోవడానికి గాను పోవడానికి జోహార పురం రోడ్డు వద్ద సిద్ధంగా ఉండగా కర్నూలు మూడవ పట్టణ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి దొంగలించబడిన బంగారు గొలుసు సుమారు ఒక తులం ఒక కత్తి, ఒక కత్తెర మరియు ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకొని ఆమెను రిమాండ్ నిమిత్తం కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరచడమే హాజరు పరచగా జడ్జిగారు ఆమెకు 15 రోజులు రిమాండ్ విధించడం అయినది.
ముద్దాయి యాస్మిన్ జొహరాపురం కు చెందిన మహిళ ఆమె ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం చేస్తుంది ఆమెకు భర్త షబ్బీర్ మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె దురుద్దేశంతోనే నేరం చేసినట్టుగా అంగీకరించినట్లుగా పోలీసులు తెలియజేశారు.
ఈ కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించిన కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య, కానిస్టేబుళ్లు పరమేష్, రాముడు మరియు సుచిత్రలను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు











