అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు 90 శాతం సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలి
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి,
కూడేరు మండల తాహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన ఏపీ రైతు సంఘం నాయకులు,
( కూడేరు మండలం, అనంతపురం జిల్లా- AP )
రైతులను అన్నివిధాల ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం నాడు కూడేరు మండల కేంద్రంలోని తాహసిల్దార్ గారికి వారి కార్యాలయంలో వినతి పత్రం చేశారు, ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి కురుగుంట మనోహర్ మాట్లాడుతూ 90% సబ్సిడీతో రైతులకు అన్ని రకాల విత్తనాలు పురుగుమందులు ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా గతంలో నష్టపోయిన పంటలకు ఇంత వరుకు నష్టపరిహారం చెల్లించక పోవడం బాధాకరమైన విషయమని తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు పంపిణీ చేయడమే కాకుండా పండించిన పంటలను సైతం ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు, రైతులను ఆదుకునే విధంగా పంటలు వేయడానికి కొత్త రుణాలను మంజూరు చేయాలన్నారు,రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో ముట్టాల శ్రీరాములు, ప్రసాద్,మల రాయుడు,ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.