మాజీమంత్రి రజని నా పొలాన్ని కబ్జా చేశారు. నా పొలం నాకు ఇప్పించండి.
బాధితుడు శ్రీరామ్ వెంకటేశ్వరరావు చిలకలూరిపేట రూరల్ సీఐ కి పిర్యాదు.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట:
చిలకలూరిపేట పట్టణంలోని పసుమర్తి గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటేశ్వరరావు అను వ్యక్తి పసుమర్తి గ్రామశివారులో వున్న తనకు చెందిన ఒక ఎకరం పొలాన్ని మాజీమంత్రి రజని, వారి అనుచరులతో తన పొలం కబ్జా చేశారని, తన పొలం తనకు ఇప్పించాలని బాధితుడు చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. Also Read నల్లమలకు అడవి దున్న
బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం తన తండ్రి 1987వ సంవత్సరంలో పసుమర్తి గ్రామ శివారులో ఒక ఎకరం పొలం కొన్నారని, అప్పటి నుండి ఆ పొలం తమ ఆధీనంలో వుందని పేర్కొన్నారు. ఆ పొలం అప్పటి నుండి నేటి వరకు యూనియన్ బ్యాంకులో తనఖాలో వుందని వివరించారు.
అయితే మాజీమంత్రి విడదల రజని మద్దినగర్లో ఒక కంపెనీ కొనుగోలు చేసిందని, ఆ కంపెనీ ముందు ఎన్క్రొచ్మెంట్లో 34 కుటుంబాలు వున్నాయని వారు ఖాళీ చేయకపోవటంతో తనపొలంలో ఒక్కొక్కరికి సెంటుంపాతిక (1.25సెంటు) చొప్పున తప్పుడు రిజిస్ట్రేషన్ల ను చేసిందని అన్నారు. దీని తాలూకు తనకు ఏటువంటి డబ్బు చెల్లించలేదని తెలిపారు.
అంతే కాక ఈ విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించినట్లు ఆయన తెలిపారు. తన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేయకుండా తను హైకోర్టు నుండి స్టే కూడా తెచ్చుకున్నాను అని తెలిపారు. అయితే తమ గ్రామంలో రైతుల వద్ద లంచంగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వటంతో తాను కూడా స్థానిక MLA పుల్లారావు, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలును కలువగా వారు చిలకలూరిపేట రూరల్ సీఐ ని కలవమని చెప్పటంతో నేడు పిర్యాదు చేసానని అన్నారు. సీఐ తనకు న్యాయం చేస్తారని తెలిపారని అన్నారు.