నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగుడూరు హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్ తెలిపారు. పట్టణంలోని డీఎస్సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఈనెల 14వ తేదీ నుంచి కనిపించకపోవడంతో అతడి భార్య శివమ్మ పాములపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 17వ తేదీన గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామం వద్ద కేసీ కెనాల్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించడంతో పోలీసులు పరిశీలించారు. సిద్ధయ్య భార్యను పిలిపించడంతో ఆమె గుర్తు పట్టగా కేసును తిరిగి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
ఆత్మకూరు సీఐ సురేష్ కుమార్ రెడ్డి , పాములపాడు ఎస్ఐ ఐ సురేష్ కేసు విచారణ ముమ్మరం చేశారు. అదే గ్రామానికి చెందిన సురేష్, అశోక్ అనే వ్యక్తు లపై అనుమానం రావడంతో పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి విచారించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. సురేష్, అశోక్, మృతి చెందిన సిద్ధయ్య కొంతకాలంగా స్నేహితులు. వీరు ముగ్గురు మద్యం తాగే సమయంలో అప్పుడప్పుడు సిద్దయ్య భార్య శివమ్మతో సురేష్ స్నేహంగా ఉండడంతో అనుమానించాడు. ఈనెల 13వ తేదీన కేసీ కెనాల్ సమీపంలోని బరకచేను వద్దకు వెళ్లారు. అక్కడ సిద్దయ్య, అశోక్, సురేష్ ముగ్గురూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సిద్ధయ్య తన భార్యతో నీకు అక్రమ సంబంధం ఉందని, గ్రామంలో అందరికీ తెలిపి పరువు తీస్తానని చెప్పడంతో భయాందోళనకు గురైన సురేష్ వెంటనే బండ తీసుకుని సిద్ధయ్య తలపై బాదాడు. అనంతరం సిద్ధయ్య బతికుండగానే అశోక్, సురేష్ కలిసి కేసీ కెనాల్లోకి తోచారు. ఇద్దరు కలిసి పథకం ప్రకారం కలిసి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నారని డియస్ పి రామాంజినాయక్ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తలస్తున్నట్లు తెలిపారు.
సి ఐ సురేష్ కుమార్ రెడ్డి పై ప్రశంశల వర్షం
సీఐ సురేష్ కుమార్ రెడ్డి ఈ కేసులో ఏ ఎవిడెన్స్ లేకపోయినా చాలా చాకచక్యంగా వ్యవహరించి కేసును చేదించారని డియస్ పి రామాంజినాయక్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి ని ప్రశంసించారు . ఆత్మకూరు సి ఐ గా బాద్యతలు తీసుకున్న రెండు నెలలోనే పలు కేసులు చేదించడం హర్షించ దగ్గ విషయమని అన్నారు . కేసులపట్ల నిర్లక్ష్యం వహించకుండా ఇలా త్వరితగతిన పూర్తి చేయడం వల్ల ప్రజల్లో పోలీసులపై మంచి నమ్మకం ఏర్పడుతుందని ఇలాండి ఆఫీసర్ల వల్ల పోలీస్ డిపార్ట్ మెంట్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించు కుంటుందని.. సీఐ సురేష్ కుమార్ రెడ్డి పై ప్రశంశల వర్షం కురిపించారు.
కార్యక్రమంలో ఆత్మకూరు తాలూకా సీఐ సురేష్ కుమార్ రెడ్డి , ఎస్ఐ సురేష్ బా బు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV