“ఎగ్-ఎ-డే కీప్స్ ది డాక్టర్ ఎవే” అనేది ఒకప్పటి సూక్తి! ఇప్పుడు రోజుకు అరడజను గుడ్లను తిన్నా ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండదని నేటి హృద్రోగ నిపుణుల మాట.
‘గ్రుడ్డు లోని పచ్చసాన గురించి కూడా మనలో కొందరికి వున్న భయం కూడా అనవసరమేనని ఆగస్టు 17న హైదరాబాదులో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎ.ఐ.జి. ఆసుపత్రి హృద్రోగ నిపుణుడు డాక్టర్ పి.వి. సత్యన్నారాయణ మనకు భరోసా ఇచ్చారు.
2019 నుండి మూడేళ్ల వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రతిరోజూ పచ్చసొనతో పాటు కోడిగ్రుడ్లను తినమని సూచించింది.
కోడిగ్రుడ్డుతో మన ఆరోగ్యానికి భరోసా
దేశంలోని ప్రముఖ హృద్రోగ నిపుణులు మరియు పోషకాహార నిపుణులు పాల్గొన్న ఈ సమావేశంలో వక్తలు, కోడిగ్రుడ్లవల్ల ఎటువంటి హాని ఉండదని భరోసా ఇస్తూ..
ఉడికించిన గుడ్లను రోజుకు ఆరు వరకు తిన్నందువల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని రోజుకు ఆరు వరకు ఉడికించిన కోడిగ్రుడ్లు తినుట వల్ల ఎవరికీ ఎటువంటి అనారోగ్య సమస్య వుండదని పైగా గ్రుడ్లలో వుండే మనకు అత్యవసరమైన 9 ఎమైనోయాసిడ్స్ మరియూ ఒమేగా-3 క్రొవ్వు ఆమ్లాలు, జింకు, కావరు, మాంగనీసు, సెలీనియం వంటి ముఖ్యధాతువుల వల్ల మన శరీర వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ సదస్సులో ముఖ్య ప్రసంగం చేసిన ప్రముఖ హృద్రోగ నిపుణులు ఎ.ఐ.జి. హాస్పిటల్ ప్రధాన కార్డియాలజిస్టు డాక్టర్ పి.వి. సత్యన్నారాయణ తన కీలక ప్రసంగంలో అనేక శాస్త్రీయ ఆధారాలతో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గుడ్డు యొక్క ప్రయోజనాలను ముఖ్యంగా కోడిగ్రుడ్డులోని కొలెస్టెరాల్ గురించి సాధారణ ప్రజానీకంలోనేకాక కొందరు కూడా నెలకొన్న అనేక సందేహాలను విస్పష్టంగా నివృత్తి చేశారు.
Plz Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1
కోడిగ్రుడ్డు పచ్చసొనలో ఉండే కొలెస్టెరాల్ హెచ్.డి.ఎల్. అని అది గుండెకు మేలు చేసేదే తప్ప దీనివల్ల ఎటువంటి చెడూ ఉండదని, పైపెచ్చు దీనిలో గుండెపోటును తగ్గించే గుణంతో పాటు ఇతర హృద్రోగాలను, కాన్సర్స్ వచ్చే అవకాశాలను సైతం తగ్గిస్తుందని వివరించారు.
వాస్తవానికి గ్రుడ్లు తినే వారిలో ఆయుర్ధాయము, తినని వారిలో కంటే ఎక్కువని కూడా వివరించారు.
గ్రుడ్డులోని కాలీన్ నాడీ వ్యవస్థలోని జీవకణాల కవచాన్ని పటిష్టపరచి మెదడు ఎదుగుదలకు, చురుకుదనానికి దోహదపడుతుందని వివరించారు.
పురుషులలో వీర్యకణాల ఉత్పత్తికి, లైంగిక పటుత్వానికి, అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోను ఉత్పత్తికి, మహిళల జననేంద్రియ వ్యవస్థలో చురుకుదనానికి అవసరమైన ఈస్ట్రోజన్ హార్మోను ఉత్పత్తికి కూడా గ్రుడ్ల ద్వారా లభించే కొలెస్టెరాల్ దోహదపడుతుందని వివరించారు.
ఎముకల పటుత్వానికి అవసరమైన విటమిన్ డి అంతర్గత ఉత్పత్తికి కూడా గ్రుడ్లలోని కొలెస్టెరాల్ సాయపడుతుంది. గ్రుడ్డులోని కొలెస్టెరాల్ వల్ల డయాబెటిక్ పేషంట్లు ఎదుర్కొనే అనేక ఇతర ఆరోగ్య సమస్యల తీవ్రత కూడా తగ్గుతుంది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
కోడిగ్రుడ్డుతో మన ఆరోగ్యానికి భరోసా
గుండె రక్తనాళాలు మూసుకుపోవుట వల్ల వచ్చే గుండెపోటుకు కొలెస్టెరాల్ ఏమాత్రమూ కారణం కాదని కూడా సోదాహరణంగా వివరించారు.
అయితే ఉడికించిన గ్రుడ్లను రోజులో 8 వరకు పచ్చసొనతో సహా తింటే ఎటువంటి ముప్పు వుండదని, కానీ బిర్యానీలు, నూనెలు, ఇతర కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వుండే ఆహారాలతోపాటు గ్రుడ్లు తినడం మంచిది కాదని హెచ్చరించారు. గ్రుడ్డులోని పచ్చసొనలో ఎటువంటి ముప్పు ఉండదని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం లేయర్ ఫారాలలో ఉత్పత్తి అయ్యే గ్రుడ్లలో జీవం ఉండదు. కాబట్టి వీటిని శాఖాహారులు సైతం నిరభ్యంతరంగా తినవచ్చునని మహాత్మాగాంధీ, స్వామివివేకానంద వంటి మహనీయులు సైతం కోడిగ్రుడ్ల వినియోగాన్ని ప్రోత్సహించారని గుర్తు చేశారు.
ఈ సదస్సులో పాల్గొన్న కార్డియాలజిస్టు డాక్టర్ మలీంద్రస్వామి, ప్రముఖ న్యూట్రిషనిస్టులు డాక్టర్ అరులప్ప, డాక్టర్ సుజాత స్టీఫెన్, డైటీషియన్ దుర్గాప్రసాద్ తదితరులు కోడిగ్రుడ్ల వినియోగంపై చైతన్యవంతమైన అవగాహనా ప్రసంగాలు చేసి, సభికుల సందేహాలను నివృత్తి చేశారు.
ప్రముఖ కీటో డైటీషియన్ సురేష్బాబు ఈ కార్యక్రమంలోనే 32 కోడిగుడ్లను తిని స్వయంగా సభికులకు భరోసా ఇచ్చి, తాను గత 10 సంవత్సరాలుగా ప్రతి రోజూ 10 నుండి 20 కోడిగ్రుడ్లను తింటున్నానని, ఈ సమయంలో తన శరీరబరువు 50 కిలోలు తగ్గటమేకాక తన డయబెటిక్ సమస్య కూడా సమసి పోయిందని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సలహాదారు డాక్టర్ బాలస్వామి నిర్వహించగా, డాక్టర్ జయసూర్య స్టేజి కార్యక్రమాన్ని నడిపించారు.