మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం.
మానవాళికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు సిరిధాన్యాలని చెబుతారు ప్రొఫెసర్ ఖాదర్ వలీ. గత ఇరవైఏళ్లుగా ఆయన…
సిరిధాన్యాల ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అనేక రుగ్మతల్ని సిరిధాన్యాలతో ఎదుర్కోవచ్చని నిరూపించారీ.. ‘మిల్లెట్ మ్యాన్’.
ఆరోగ్య ధాన్యాల ప్రాధాన్యం ప్రొఫెసర్ ఖాదర్ వలీ మాటల్లోనే..
సృష్టికర్త అనేక రకాల ఆహారోత్పత్తులను మనకు అందించాడు. మనం మాత్రం వరి, గోధుమ, మైదాలాంటి వాటి మీదే అధారపడి బతుకుతున్నాం.
ఈ అపసవ్య ధోరణి మహా అయితే వందేళ్లక్రితం మొదలైపోయి… పాతికేళ్ల క్రితం పరాకాష్టకు చేరుకుంది. నూట యాభై ఏళ్లకు పూర్వం అందరూ సిరిధాన్యాలే తినే వాళ్లు.
తర్వాతి కాలంలో వరి అన్నం మీద ఇష్టం పెరిగింది. ఆ మోజులో అమృతంలాంటి సిరి ధాన్యాల్ని నిర్లక్ష్యం చేశారు. కాల క్రమేణా వంటింట్లోంచే కాదు..
ఇంట్లోంచి, ఊళ్లోంచి, పొలంలోంచి కూడా తరిమేశారు. అదో పెద్ద తప్పు. సరిగ్గా అప్పటి నుంచే మనం రోగాల బారిన పడుతున్నాం.
దీనికితోడు.. వరి, గోధుమలను పండించే పద్దతిలోనూ పెను మార్పులు వచ్చాయి. కృత్రిమ ఎరువులూ పురుగు మందుల వాడకం పెరిగింది.
దీంతో స్వచ్ఛమైన ఆహారం నోటికి చేరడం లేదు. ఆ పంటల్లో ఉండాల్సినంత పరిమాణంలో పీచుపదార్థం ఉండటం లేదు. అనేక రుగ్మతలకు ఇదో కారణం.
ఆ ఊబిలోంచి బయటపడాలంటే… వరి, గోధుమలతో చేసిన వంటకాలను బాగా తగ్గించాలి. సిరిధాన్యాలను పళ్లెంలోకి స్వాగతించాలి.
సామలు, ఊదలు, కొర్రలు, అరికలు, అండు కొర్రలు..ఈ అయిదింటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగు తుంది. వ్యాధి కారకాలు శరీరంలోంచి బయటికి వెళ్లిపోతాయి.
ఫలితంగా, సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఆహార పదార్థాల గుణగణాల్ని అందులోని పీచు, పిండి పదార్థాలే నిర్ణయిస్తాయి.
వరిలో పీచు 0.2 శాతం ఉంటే, పిండిపదార్థం 79 శాతం. వరన్నం తిన్నాక, ఒకేసారి అధిక మోతాదులో గ్లూకోజు రక్తంలోకి విడుదలైపోయి.. అనేక రోగాలకు కారణం అవుతోంది. అదే సిరిధాన్యాలలోని పీచు పదార్థం 8 నుంచి 12 శాతం, పిండి పదార్థం 60 నుంచి 69 శాతం ఉంటుంది. గూకోజ్ నెమ్మదిగా, సమతుల్యంగా రక్తంలోకి చేరుతుంది.
అడవి అవసరం
రక్తహీనత, మధుమేహం, కంటి సమస్యలు, ఊబకాయం, మలబద్ధకం, నిద్రలేమి, మూర్ఛ లాంటి ఎన్నో రోగాల నుంచి సిరిధాన్యాలు విముక్తిని కలిగిస్తాయి. వీటిని తినడం ప్రారంభించిన ఆరు నెలల నుంచి రెండేళ్లలో ఎన్నో వ్యాధులు తగ్గుముఖం పడతాయి. సిరిధాన్యాలే మనుషులకు అసలైన ఆరోగ్య ఆహారం అని చెప్పడానికే నేను మైసూరులో ‘అటవీ కృషి’ని ప్రారంభించాను.
గత ఇరవై ఏళ్లుగా అక్కడి రైతులతో, రోగులతో కలిసి పనిచేస్తున్నా. ‘అటవీ కృషి’లో భాగంగానే మైసూరులో ఏడున్నర ఎకరాల భూమిని కొని… మూడు ఎకరాల్లో అడవిని పెంచాను. నాలుగున్నర ఎకరాల్లో సిరిధాన్యాల్ని పండిస్తున్నా. పంటలు పండాలంటే అడవి చాలా ముఖ్యమని నా నమ్మకం.
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
అడవిలోని ఆకులు, అలములు, పక్షుల రెట్టలే భూమిని సారవంతం చేస్తాయి. వాటిని తెచ్చి పొలాల్లో చల్లుకుంటే చాలు, రసాయన ఎరువుల అవసరమే లేదు. ఈ పద్ధతిలోనే మేం ఎకరానికి పది క్వింటాళ్ల గింజల్ని పండిస్తున్నాం.
- క్యాన్సరు చెక్…
ముప్పయ్యేళ్లకు ముందు క్యాన్సర్ రోగులు పెద్దగా ఉండేవారు కాదు. అదే ఇప్పుడు, ప్రతి ఐదుగురిలో ఒకరో ఇద్దరో కనిపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, 2030 నాటికి కోటి నలభై లక్షల నుంచి రెండు కోట్ల మంది వరకు క్యాన్సర్ పీడితులు ఉండొచ్చు.
Also Read..ఊరి గొడవలు — పోలీసులు – ఓ కాసరకాయల కథ
దీనికి ప్రధాన కారణం మన ఆహారం విషతుల్యం కావడమే. నా దగ్గరకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా వస్తుంటారు. వాళ్లకు నేను సిరిధాన్యాలతో, కషాయాలతో చికిత్స చేస్తున్నాను. వారానికి ఒకసారైనా నువ్వుల లడ్డు తినమని అందరికీ చెబుతుంటాను.
ఆహారంతో పాటూ హోమియో, ఆయుర్వేదం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నియంత్రించవచ్చు.
Also Read Samsung 189 cm (75 inches) 8K Ultra HD Smart Neo QLED TV
ఎలా తినాలి?
సిరిధాన్యాలలో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి తినడానికి రెండు నుంచి నాలుగు గంటల ముందే నానబెట్టుకుని వండుకోవాలి. వీటితో అన్నమే కాదు… రొట్టెలు, దోశెలు, ఇడ్లీలు, పొంగలి, ఉప్మా, బిర్యానీ.. ఎన్నో వంటలు వండుకోవచ్చు. కుక్కరులో అయితే గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోస్తే అన్నం సిద్ధమైపోతుంది. అదే అత్తెసరు అన్నమైతే, నాలుగైదు గ్లాసుల నీళ్లు పోయాల్సి వస్తుంది. ఈ అన్నానికి తాటి బెల్లం, నెయ్యి కలిపి స్వీటులా చేసుకుని తినొచ్చు. ఎలా తిన్నా సిరిధాన్యాలు ఆరోగ్యసిరినిస్తాయి..!
(‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’