తెలంగాణ రాష్ట్రంలో ఆకుకూరలన్నీ కలిపి ప్రస్తుతం సుమారుగా 4,85,000 హెక్టార్లలో సాగు చేయబడి 38,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడిని ఇస్తున్నాయి. మనం పండించే ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది.
ఆకుకూరలు సమీకృత పోషకాహారంలో చాలా ముఖ్యమైన భాగం. వేసవి మరియు వర్షాకాలంలో పండించే ముఖ్యమైన ఆకుకూర. ఇందులో మాంసకృత్తులు, లవణాలు, కాల్షియం, ఇనుము, విటమిన్ ‘ఎ’ మరియు ”సి’ అధికంగా ఉంటాయి.
ప్రస్తుతం సాగులో ఉన్న సమస్యలు: ప్రాంతాల వారీగా అనువైన అధిక దిగుబడినిచ్చు రకాలు లేకపోవడం.
దిగుబడి పెంచటానికి మార్గాలు
- ఆరుతడి పంటగా విస్తీర్ణము పెరగాలి.
- తక్కువ కాలపరిమితి కలిగి, అధిక దిగుబడి శక్తిగల రకాలను రూపొందించాలి.
- మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం
- సమగ్ర ఎరువుల మరియు సస్యరక్షణ చర్యలు చేపట్టటం
వాతావరణం: వివిధ శీతోష్ణ పరిస్థితుల్లో పెంచటానికి అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటే పెరుగుదల సరిగా ఉండదు.
నేలలు: ఇసుకతో కూడిన గరపనేల అనుకూలం. పి.హెచ్. 6.0-7.0 ఉన్న నేలలు అనుకూలం. నీరు నిలిచే బంక మట్టి నేలలు మరియు ఇసుక నేలలు పనికిరావు.
పంటకాలం: వర్షాకాలం: జూన్-అక్టోబర్, వేసవి 5500: జనవరి-మే.
వివిధ ప్రాంతాలకు అనువైన రకాలు: కో-1, కో-2, కో-3, కో-4, కో-5, పూసా చోటి చౌలై, పూసాబడి చౌలై, పూసాకీర్తి, పూసాకీర్తి, పూసా కిరణ్, పూసాలాల్ చౌలై, ఆర్.ఎన్.ఎ.-1, సిరికూర, అర్క సుగుణ.
ఆర్.ఎన్.ఎ-1: ఆకులు మరియు కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకంలో విటమిన్ ‘ఎ’, ‘సి’లు అధికంగా ఉండటమే కాక కాండం కూడా పీచు లేకుండా చాలా మృదువుగా ఉండి రుచికరంగా ఉంటుంది. నెల రోజుల్లో ఒక ఎకరాకు 6-7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. మొదటి కోత విత్తిన 15-20 రోజులకు వస్తుంది. కోత తరువాత బాగా శాఖలు విస్తరిస్తాయి. నీటి ఎద్దడి, తెల్ల ఆకుమచ్చ తెగులును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ మరియు వేసవి కాలంలో పండించేందుకు అనువైనది. - కో-1: ఆకులు మరియు కాండం లావుగా ఉండి కండ కలిగి ఉంటాయి. ఒక ఎకరానికి 3-3.5 టన్నుల దిగుబడిని 25 రోజులలో ఇస్తుంది. ఆకులు వెడల్పుగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. విత్తనాలు చిన్నవిగా, నల్లగా ఉంటాయి.
- కో-2: ఆకులు కోలగా, ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. కాండం లేతగా, మృదువుగా ఉంటుంది. విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది. కాండం కూరగా పనికివస్తుంది. ఎకరాకు 4-5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. విత్తనాలు పెద్దవిగా, నల్లగా ఉంటాయి.
- కో-3: ఇది కోత రకము. “అమరాంథస్ ట్రిప్టిన్” జాతికి చెందినది. విత్తిన 25 రోజుల నుంచి కోత మొదలు పెట్టి 10 కోతల వరకు వారం రోజుల తేడాతో తీసికొనవచ్చును. ఎకరాకు 4-5 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది.
తోటకూర సాగు
- పూసా చోటి చౌలై: మొక్కలు పొట్టిగా, ఆకులు చిన్నవిగా ఉంటాయి. కోత రకం.
- పూసాబడి చౌలై: ఇది కూడా “భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ”, న్యూఢిల్లీ వారిచే విడుదల చేయబడినది. ఇది ‘అమరాంథస్ ట్రై కలర్’ జాతికి చెందినది. మొక్కలు పొడవుగా, కాండం లావుగా లేతగా ఉండి, ఆకులు పెద్దవిగా ఉంటాయి.
- పూసాకీర్తి: ఈ రకము కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూఢిల్లీ వారిచే విడుదల చేయబడింది. ఆకులు ఆకుపచ్చగా ‘గ్రుడ్డు’ ఆకారంలో ఉండటం, విత్తిన 30-35 రోజుల నుండి కోత మొదలు పెట్టి 70-85 రోజుల వరకు పొడిగించవచ్చును. ముఖ్యంగా ఎండాకాలానికి (మార్చి-జూన్) చాలా మంచి రకం. ఎకరాకు 22 టన్నుల వరకు దిగుబడి వస్తుంది
- పూసా కిరణ్: ఐ.ఎ.ఆర్.ఐ, న్యూఢిల్లీ వారిచే విడుదల చేయబడింది.
ఈ రకం అమరాంతస్ ట్రైకలర్ అమరాంతస్ ట్రెస్టిన్ సంకర పర్చగా వచ్చిన మొక్కల నుండి ఎన్నిక చేసి అభివృద్ధి పరచిన రకం. ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలకు అనువైన రకం. ఎకరాకు 14 టన్నుల దిగుబడినిచ్చును.
సిరికూర: మొక్కలు పొట్టిగా, ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం కూడా కూరగా పనికి వస్తుంది. ఎకరాకు 4-5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. విత్తనాలు పెద్దవిగా, నల్లగా ఉంటాయి.
‘పై రకాలే కాకుండా అర్క సుగుణ, అర్క అరుణ (ఎర్ర తోటకూర) రకాలను కూడా సాగు చేయవచ్చు.
నేల తయారి: నేలను 4-5
సార్లు బాగా దుక్కి దున్నాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను బాగా చదును చేసుకోవాలి.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
విత్తటం: 2×1.5 మీ. మడుల్లో పలుచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నటి ఇసుకతో కలిపి వేయాలి. నారుమడిలో పోసుకొని కూడా 20×20 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి.
ఎరువులు: అవసరమయిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి. అంతరకృషి: కలుపుని తగిన చర్యలు చేపట్టి నివారించుకోవాలి.
సాగునీటి యాజమాన్యం: విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మరల 3వ
రోజు నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి 7-10 రోజుల వ్యవధితో నీరు కట్టాలి. వేసవిలో 5-6 రోజులకు ఒక తడి ఇవ్వాలి. మొదటిసారి నీరు కట్టేటప్పుడు నీటిని నెమ్మదిగా కట్టాలి. నీటి ఒరవడి ఎక్కువైనచో విత్తనం మడులలో క్రిందివైపునకు కొట్టుకు వచ్చి మొలక ఎక్కువ తక్కువలుగా ఉండును.
దిగుబడి: కోత రకాలలో విత్తిన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజులలో ఎకరాకు 4-5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
తోటకూర సాగు
మొక్కలను వేర్లతో సహా పీకి కట్టలు కట్టే రకాలలో ఎకరాకు 3 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.
కో-1, కో-2 లాంటి రకాలను విత్తిన 25 రోజులకు వేర్లతో సహా పీకి కట్టలు కట్టి అమ్మాలి. ఈ రకాల్లో ఎకరాకి 3-4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
కో-3 లాంటి కోత రకాల్లో, విత్తిన 25 రోజులకు మొదటిసారిగా కొమ్మలను త్రుంచాలి. తరువాత ప్రతి వారం రోజులకు ఒక కోత చొప్పున 90 రోజుల వరకు కోతలు తీసుకోవాలి.
గింజల కోసం పండించే తోటకూరలో, మొక్కలను 25 రోజులకు 30×30 సెం.మీ. దూరానికి పలుచన చేయటం ద్వారా 3-3.5 టన్నుల దిగుబడి వచ్చును. వదిలిన మొక్కల నుండి గింజలను తీయటం వలన 0.8 నుండి 1.0 టన్ను వరకు దిగుబడి వచ్చును.
కోత అనంతరం ఏర్పడే నష్టాలు
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
- తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కుళ్ళిపోవడం
- వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస క్రియ చాలా తక్కువగా ఉండటం వలన వడలిపోవడం.
- యాంత్రిక నష్టం. త్వరగా కుళ్ళిపోవటం.
నిల్వ: జీరో ఎనర్జీ (శూన్య శక్తితో పనిచేసే) శీతల గదిలో ఆకుకూరలను నిల్వ చేసిన మాము మామూలుగా నిల్వ చేసుకునే సమయం కన్నా 3 రెట్లు ఎక్కువ సమయం వరకు నిల్వ చేసికొనవచ్చు.
ఉపయోగాలు: - ఆకును ఆకుకూరగా, పప్పులో, పరోటాలలో ఉపయోగిస్తారు.
- గింజలను పేలాలుగా, చిక్కీలుగా మరియు ‘మాల్ట్’లలో ఉపయోగిస్తారు.
కె. సాదన. వ.వసాయ కళాశాల, పాలెం, పొపెసర్ జయశంకర్