అన్నదాత రెక్కల కష్టం వర్షార్పణ మైంది. కొంతకాలంగా కురుస్తున్న వానలకు పైర్లన్నీ నీట మునిగి తీవ్ర నష్టం కలిగింది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
- భారీ వర్షాలతో దెబ్బతిన్న పైర్లు
- ఆందోళనలో అన్నదాత
AP: నంద్యాల జిల్లా ఆత్మకూరు: ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు పడటంతో డివిజన్లో దాదాపు 10 వేల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. అయితే ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది రికార్డుస్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆగస్టు నెలలో సాధారణం గా 165 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా వారం కూడా కాకముందే 100 మి.మీ. వర్షపాతం సమోదైంది. ఇంకా ఈనెల మరో 20 రోజులకుపైగా ఉండడంతో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షం. పడే అవకాశం ఉంది.
మే నెలలో సాధారణ వర్ష్చ పాతం కేవలం 29 మి.మీ. కాగా, గత పదేళ్లల్లో ఎన్నడూ లేనంతగా 199 మి.మీ. రికార్డుస్థాయిలో వర్షం కురిసింది.జూన్ నెలలో సాధారణంగా 92 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా అత్యధికంగా 250.2 మి.మీ. భారీ వర్షం కురిసింది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
జూలై నెలలో 167 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ 281.9 మీ.మీ. వర్షం కురిసింది. ఇలా భారి వర్షాల కారణంగా పైర్లన్నీ నీట మునిగిపోవడంతో.. అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీట మునిగిన పైర్లు ఆత్మకూరు మండలంలో ఈయేడాది దాదాపు 10 వేల హెక్టార్లలో రైతులు మొక్కజొన్న, పత్తి, కంది, మెట్ట వరి పంటలను సాగుచేశాడు.
పైర్లు బాగా పెరుగుతున్నాయని రైతులు సంబరపడుతున్న సమయంలో వరుణుడు కక్ష్యకట్టినట్లు ఎడతెరిపిని వ్వకుండా కురుస్తున్నాడు.
దాదాపు నెలలో 20 నుల చి 22 రోజులకు పైగా విస్తారంగా వర్షాలు కురవడం తో పైర్లన్నీ భారీగా దెబ్బతిన్నాయి.
మొక్కజొన్న, కంది పైర్లకు పూర్తి నష్టం కలిగింది. కాగా ఆత్మకూరు మండలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు పర్య టించి పంట నష్టంపై అంచనాలు రూపొందించారు.
2,700 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట నష్టం
అత్మకూరు మండలంలో అత్యధికంగా మొక్కజ “న్న సాగు చేశారు. 7 వేల ఎకరాల్లో పంట సాగు చేయగా ఇప్పటికే దాదాపు 2,700 ఎకరాల్లో..
వం ట పూర్తిగా దెబ్బతిందని రెవెన్యూ అధికారుల లెక్కలు చెబుతున్నా అంతకు ఎక్కువగానే నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంది పంట కూడా పూర్తిగా దెబ్బతింది పంటలు చేతికొచ్చే సమయంలో ఊహించని రీతిలో వరు ఇుడి రాకతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి
పెట్టుబడులు కూడా ఎక్కువే.. మే, జూన్ నెలల్లో రైతులు వేసిన మొక్కజొన్న పంట ఏపుగా పెరగకపోవడంతో పంటను ధ్వంసం చేసి తిరిగి రెండోసారి అదే మొక్కజొన్న పంటను సాగుచేశారు.
ఈ పంట వేస్తే అధిక వర్షాలకు పంట ఏపుగా పెరగకపోగా, చాలాచోట్ల వేర్షపునీరు నిల్వ ఉండడంతో పాటు నీరు నిల్వని పాలాల్లో ..
విస్తారంగా గడ్డి పెరగడంతో పంట పెరిగే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
ఒకటికి రెండు సార్లు విత్తనాలు, ఎరు మే, జూన్ నెలల్లో రైతులు వేసిన మొక్కజొన్న పం వులు, వ్యవసాయ పనులైన విత్తు వేయడం,
ట్రాక్టర్లతో దుక్కిదున్నడం తదితర విషయాల్లో రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల చాలా పెట్టుబడులు పెట్టారు.
అవి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకో వాలని కోరుతున్నారు