జోక్యం చేసుకోవద్దు..
ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచన
ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు.
కేబినెట్ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.అక్టోబరు తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయి.
బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నాం. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉంది. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం.
నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుంది. కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి.
లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలి. శాఖల సంబంధిత అంశాలపై ప్రతినెలా సమీక్ష చేయాలి.
మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలి. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్తున్నాం.
ఈనెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. పంటలబీమా పథకం అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నాం.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసింది” అని చంద్రబాబు వివరించారు. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు సమాచారం.
తండ్రి పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కుమారుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మన్.
ఈ ముగ్గురూ కలిసి బియ్యం రీ సైక్లింగ్ చేసి కిలో రూ.43కి ఎగుమతి చేశారని ఆక్షేపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
వచ్చే మంత్రివర్గ సమావేశంనాటికి ఏం చేద్దాం అనే దానిపై విధివిధానాలతో రావాలని నిర్ణయించారు.
- ఇసుక, గనుల పాలసీ – 2019 మరియు మరింత మెరుగైన ఇసుక విధానం -2021లను రద్దుచేస్తూ ఉచిత ఇసుక మెకానిజం -2024 ఏర్పాటు అయ్యేంత వరకు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా తేదీ: 8.7.2024న జారీ చేసిన జీవో ఎం.ఎస్ నంబర్ 43 కు కేబినెట్ ఆమోదం..
ఇప్పటివరకు ఆయా సంస్థలతో ఉన్న ఒప్పందాలను నిలుపుదల చేయడం, ఇసుక కు సంబంధించిన స్టాక్ ను సంబంధిత అధికారులకు అప్పగించాలని మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేస్తూ కేబినెట్ ఆమోదం.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
శాండ్, మైనింగ్ పాలసీ -2022 మరియు మరింత మెరుగైన ఇసుక పాలసీ -2021 లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం (కాంప్రహెన్సివ్ శాండ్ పాలసీ) – 2024 ను రూపొందించాల్సిన అవసరం ఉంది.
శాండ్ ఆపరేషన్ లో పారదర్శకతను పెంపొందించడం, ఇసుకఅక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, మార్గదర్శకాల మేరకు సమగ్రఇసుక విధానం -2024ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.