ముస్లి మైనార్టీలకు-CM చంద్రబాబు

CM Chandrababu assures Muslim minorities

CM Chandrababu assures Muslim minorities

రూ.200 కోట్లతో మైనారిటీల ప్రార్థనా మందిరాలు, షాదీఖానాల పునరుద్ధరణ మైనారిటీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాంవక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాంమౌలానా అబుల్ కలామ్ అజాద్ స్పూర్తితో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానంవిజయవాడ,నవంబర్ 11: మైనారిటీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘దేశభక్తికి చిరునామా మౌలానా అబుల్ కలామ్ అజాద్. ఆయన దేశంలో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారు. దేశ మొదటి విద్యా శాఖా మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. 1951లో మొదటిగా ఐఐటీ స్థాపించారు. అజాద్ స్పూర్తితో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నాం. టీడీపీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ వర్సిటీ పెట్టాం. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేశాం. ఒకప్పుడు మైనారిటీ సోదరులు మక్కాకు వెళ్లేందుకు బెంగుళూరు, ముంబయి వెళ్లేవారు. హైదరాబాద్ లో అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌస్ కట్టి అక్కడి నుంచి విమానంలో మక్కా పంపాం. మైనారిటీ ఫైన్సాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఏర్పాటు ఘనత టీడీపీదే. ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలతో చాలా మంది ముస్లింలు లబ్ధి పొందారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమంలో మైనారిటీలకు ప్రాధాన్యత2025-26 బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి రూ.రూ.5,434 కోట్లు కేటాయించాం. ఎన్నికల్లో హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేశాం. మైనారిటీలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తున్నాం. మైనారిటీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చాం. 175 మందిని DSC ద్వారా ఉర్దూ ఉపాధ్యాయులుగా నియమించాం. పీఎం వికాస్ పథకం కింద రూ.11 కోట్లతో 1,500 మందికి నైపుణ్య శిక్షణ ప్రారంభించాం. రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకూ ఉచితంగా చదివిస్తున్నాం. ఇమామ్‌లకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. హజ్ యాత్రికుల కోసం ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిలిచిన వెయ్యికి పైగా మసీదులు, చర్చి, షాదీఖానాలు, కమ్యూనిటీ హాళ్లనిర్మాణం, పునరుద్ధరణకు రూ.200 కోట్లు మంజూరు చేస్తాం. వక్ఫ్ ఆస్తులను రక్షిస్తున్నాం. అర్హత కలిగిన ఇమామ్ లందరినీ ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం. నూర్ బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం’ అని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాన్ని గాలికి వదిలేసింది‘గత ప్రభుత్వం ఐదేళ్లూ మైనారిటీల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు షాదీఖానాల నిర్మాణాలకు పైసా కూడా ఇవ్వలేదు. నిలిచిపోయిన పనులన్నింటినీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. నంద్యాల జిల్లాలో ముస్లిం ధార్మిక సమ్మేళనం ఇస్తెమా కార్యక్రమానికి రూ.కోటీ 75 లక్షల మంజూరు చేశాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు‘రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి నగదు ప్రోత్సాహకాలను సీఎం అందించారు. మౌలానా ఆజాద్ జాతీయ పురస్కారం కింద రూ.2.5 లక్షల నగదును అవార్డు గ్రహీతకు అందించారు. అలాగే అబ్దుల్ హక్ అవార్డు కింద 1.25 లక్షలు, రైజింగ్ స్పోర్ట్స్ పర్సన్ విభాగంలో నలుగురికి లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సీఎం అందించారు. దీంతో పాటు జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన 8 మందకికి రూ.25 వేల చొప్పున సీఎం అందజేశారు. ఉత్తమ ఉర్దూ అధ్యాపకులుగా ఐదుగురు, ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మంది ఎంపికవ్వగా వారందరికీ రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు. ఉత్తమ విద్యార్థులుగా ఎంపికైన 58 మందికి రూ.5 వేలు చొప్పున సీఎం అందించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూఖ్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top