పై ఫోటో లో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో ఉన్న వ్యక్తి ని గుర్తు పట్టగలరా..?
సాదా సీదా గా ఒక మామూలు రైతు లాగా ఉన్న ఈ వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పట్టాన నమ్మలేం.
అంతే కాదు.. ఒక రాజకీయ పార్టీకి అధినేత కూడా…
ఈయన ఎవరో కాదు కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి. పేరు N. రంగసామి.
2001 లో కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత బయట కొచ్చి All India N R congress పార్టీ పెట్టారు.
వ్యవసాయ దారుడైన రంగ సామి గారు పార్టీ కోసం, ప్రజల కోసం తన పొలాన్ని మొత్తం అమ్ముకున్నాడు.
గడిచిన 22 ఏళ్ల లో ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 14 ఏళ్ల సుదీర్ఘ కాలం ఆ పదవి లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ NDA లో ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అప్పోయింట్మెంట్ అతి సులభంగా తెచ్చుకోగల పలుకుబడి ఉంది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
అయినా ఎంతో సింపుల్ గా ఉంటారు. కించిత్ గర్వం కానీ, అతిశయం కానీ ఉండదు.
ముఖ్యమంత్రి గా కనీస ప్రోటోకాల్ ఉండదు. ఒక్క గన్ మాన్ కూడా ఉండడు. సామాన్యుడు కూడా నేరుగా ఆయన ఇంట్లోకి వెళ్లి రాగలడు. ఇల్లు అతి సామాన్యం.
రెండు బెడ్ రూమ్స్, రెండు ఫాన్స్ మాత్రమే. ఏ.సీ అన్న మాటే లేదు.
పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజా సేవ కు అంకితం అయ్యాడు. ఉదయం లేస్తూనే తన వీధి మొదట్లో ఉన్న తన క్లాస్ మేట్ నడిపే టీ దుకాణం వద్దకు నడిచి వెళ్లి టీ సేవిస్తూ దిన పత్రికలు చదువుతారు.
పుదుచ్చేరి పట్టణం లో ఆయన స్కూటర్ పై వెళ్తూ ప్రజలతో మమేకం అవుతుంటారు. ప్రజా సమస్య లు అక్కడి కక్కడే పరిష్కరిస్తారు. స్కూటర్ మరీ పాత బడి పోయి తరుచూ రిపేర్లు వస్తుంటే.. ఈమధ్యనే ఒక సెకండ్ హ్యాండ్ యమహా బైక్ కొన్నారట.
అధికారిక టూర్ లకు వెళ్లినా ఒక మామూలు డఫెల్ బ్యాగ్ లో రెండు జతల ఖద్దరు బట్టలు మాత్రమే ఉంటాయి.
అనుకోని అతిధి… శిల్పన్నకు కుదిరిన మైత్రి

రాజకీయాల్లో విలువలు పెంచిన ఆ ఇద్దరు నేతలు
ప్రభుత్వ పని మీద పుదుచ్చేరి ముఖ్యమంత్రి విజయవాడ వచ్చారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
Novotel హోటల్ లో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దిగిన రూం పక్కనే ఆయన విడిది.
ఈ అనుకోని అతిధి గురించి తెలిసి మన ఎమ్మెల్యే ఆయన రూం వెళ్లి కలిశారు. ఇద్దరిదీ ఒకటే సారూప్యత. ముఖ్యమంత్రి అయినా సామాన్యుడే అని N.రంగసామి గారు రుజువు చేసి రాజకీయాల్లో విలువలు పెంచారు.
అధికార పక్షం లోంచి ప్రతిపక్ష పార్టీ లోకి వెళ్ళటం కోసం 6 ఏళ్ల ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయం గా భావించి రాజీనామా చేయడం ద్వారా నైతిక విలువలకు శిల్పా చక్రపాణి రెడ్డి కొత్త భాష్యం చెప్పిన సంగతి విదితమే…

ఇరువురు నేతలు చాలా సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
ఇద్దరు నాయకులు ప్రజా సేవకు అంకితం అయిన వారే… అభివృద్ధి కోసం అనునిత్యం తపించే వారే. ఇంకేముంది..? కాసేపట్లోనే ఇద్దరికీ స్నేహం కుదిరింది. శ్రీశైలం దేవస్థానం లోనూ, నియోజకవర్గం లోనూ ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్తున్నట్లు తెలిసి మన ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేశారు. తమ అతిధిగా పుదుచ్చేరి రావాల్సిందిగా ఎమ్మెల్యే శిల్పా ను ఆహ్వానించడమే కాదు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని తన సెల్ నెంబర్ కూడా ఇచ్చారు.