కాషాయం జెండా కప్పుకునేందుకు బుగ్గన..
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ఘోర పరాజయం చవి చూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు మరో దెబ్బ పడనుంది.
డోన్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీని వీడి, బీజేపీలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన వ్యాపారాలను కాపాడుకునేందుకే బుగ్గన పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ పరిణామాలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మాజీ సీఎం జగన్కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అత్యంత సన్నిహితునిగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో మొదటిసారి డోన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ పీఏసీ చైర్మన్ పదవిని బుగ్గనకు కట్టబెట్టారు. దీంతో అప్పట్లో అసెంబ్లీలో తనదైన ప్రసంగాలతో బుగ్గన జగన్
మరింత దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రెండోసారి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడంతో..
జగన్ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన తిరుగులేని హవా కొనసాగించారు.
పార్టీ ఓడిపోయాక ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. Best pen drive
కేంద్ర పెద్దలతో సంబంధాలు..
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేసిన సమయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రంలోని పెద్దలతో సంబంధాలు పెంచుకున్నట్లు చర్చ నడుస్తోంది.
ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు నిత్యం ఫైళ్లను పట్టుకుని బుగ్గన వెళ్తూ కనిపించేవారు. రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలోనూ
కేంద్ర నిధులు రాబట్టడంలోనూ బుగ్గన ఎక్కువసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో..
సంబందాలు పెంచుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇటు గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమంత్రిగా ఉండటం, అటూ కేంద్ర పెద్దలతోనూ..
సంబంధాలు పెంచుకున్న బుగ్గన తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. రాష్ట్రంతో పాటు తమిళనాడు, బెంగళూరు, తెలంగాణలో మైనింగ్ వ్యాపారాలను
పెంచుకోవడంతోపాటు సిమెంటు ఫ్యాక్టరీలను కొనుగోలు చేశారు. ఇలా బుగ్గన తన పలుకుబడితో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తూ వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
పార్టీ మారేందుకు బుగ్గన ప్రయత్నాలు..
రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బీజేపీలోకి వెళ్లేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వారం రోజులుగా బుగ్గన ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో బీజేపీలో చేరే
AlsoRead నల్లమలకు వచ్చిన అడవిదున్న..దాన్ని చూసిన అటవీ అధికారులు షాక్