బుడ్డా వెంగళ రెడ్డి మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ పోటీలు

IMG-20230108-WA0024.jpg

*శ్రీ బుడ్డా వెంగళ రెడ్డి మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ పోటీలు ప్రారంభం*శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం లో ఆదివారం ఘనంగా శ్రీశైలం నియోజకవ్గస్థాయి శ్రీ బుడ్డా వెంగళ రెడ్డి మెమోరియల్ ట్రోఫి క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి క్రీడాకారుల హర్షాతిరేకాలు మధ్య మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కాలేజీ గ్రౌండ్ కు ర్యాలీగా విచ్చేశారు. అనంతరం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలను క్రీడాస్ఫూర్తితో చూడాలన్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, గెలుపు కోసం వంద శాతం ప్రయత్నించాలని అన్నారు.

శ్రీశైలం నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి ఎప్పుడు ముందుంటానని పేర్కొన్నారు. టాస్ వేసి ముందుగా బ్యాటింగ్‌ చేసి మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు క్రీడా కారుల్లో ఉత్సాహం నింపారు. అంతకు ముందు క్రీడా వాలంటరీలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ క్రీడా పోటీల్లో 24 జట్లు తలపడనున్నాయని, గెలుపొందిన వారికి రూ:50వేలు, రన్నర్స్ కు రూ: 25వేల తో పాటు ప్రతి జట్టు కు మేమొంటో ను బహుమతి ప్రదాత, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు బన్నురు రామ లింగారెడ్డి, శివ రామిరెడ్డి, కంచర్ల సురేష్, అన్నారపు శేషరెడ్డి, మల్లేశ్వర రెడ్డి, వేణు గోపాల్, శ్రీధర్ రెడ్డి, అబ్దుల్లాపూరం బాషా, కలాం, రాజా రెడ్డి, తిరుపతయ్య , మల్లికార్జున రెడ్డి, రాముర్తి మరియు నిర్వాహకులు ఎన్.ఎస్ మున్నా, హజరత్ అలి, రాఘవ,కరీం, జావిద్ లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top