సదరం పెంట చెంచుగూడెంలో ఎలుగుబంటి దాడి

Bear attack in Chenchugudem, Sadarampenta

Bear attack in Chenchugudem, Sadarampenta

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచుగూడెంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. చెంచు గిరిజనుడు నిమ్మల పెద్ద అంకన్నపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.వంట చేసుకోవడానికి కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన అంకన్నను వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత 20 రోజులుగా చెంచుగూడెం పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వీధిదీపాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎలుగుబంటి గూడెంలోకి కూడా వస్తోందని వారు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఎలుగుబంటిని పట్టుకోవాలని, గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టాలని చెంచు గిరిజనులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top