ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలి బి మాధవ్ స్వామి జిల్లా అధ్యక్షులు APTF
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వి మాధవస్వామి డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ డిసెంబర్ 12వ తేదీ న బనగానపల్లె mro ఆఫీస్ దగ్గర aptf డివిజన్ నాయకులు నిరసన చేసిన నేపథ్యంలో డిసెంబర్13వ తేదీ కొంతమంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్ హౌస్ కు జీతాలు జమ కావడం జరిగింది. అయితే ఇంకా చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకు కలిసినందుకు జీతాలు జమ కావాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వారి ముఖంలో సంతోషం ఉండే విధంగా ఆర్థికపరమైన అంశాలు అన్నింటిని ఎప్పటికప్పుడు నెరవేరుస్తానని హామీ ఇచ్చారని ఈరోజు డిఎలు పెండింగ్లో ఉన్నాయి సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్ల్స్ పిఎఫ్ లోన్లు సంవత్సరం కాలం నుండి పెండింగ్లో ఉండడంమే కాక సంవత్సరం క్రితమే డీఏలకు సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంటుకు ఇన్కమ్ టాక్స్ కూడా వసూలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు అర్థం చేసుకొని ప్రతి నెల ఒకటవ తేదీ జీతంతో పాటు అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు రాకపోతే జీవనం వెన్నకి వెళ్లిపోతుందని జీవన పరిస్థితులు గా మారుతాయని వెనక్కి నడుస్తూ వినూత్న నిరసన చేయడం జరిగింది. ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఎం మధుసూదన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు జి లింగమయ్య రాష్ట్ర కౌన్సిలర్ లు నాగరాజు సుబ్బరాయుడు బనగానపల్లె మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట కృష్ణుడు సుంకన్న మరియు ఉపాధ్యాయులు రాజు నాయక్ రమేష్ చాంద్ బాషా పోలియో నాయక్ యుగంధర్ మద్దిలేటి నరసింహులు పెద్దన్న, దస్తగిరి అలాగే తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది సువర్ణాదేవి, వెంకటరామిరెడ్డి,రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.