ప్రతి ఉదయం ప్రపంచంలో 5 బిలియను కప్పుల టీ, మరో 2 బిలియను కప్పుల కాఫీ ప్రజలు సేవిస్తున్నారు. ప్రపంచ ఆహార మ వ్యవసాయ సంస్థ అంచనాల ప్రకారం సాలీనా మరియు ప్రపంచంలో 18 బిలియను డాలర్ల విలువైన తేయాకు మరియు 126 బిలియను డాలర్ల విలువైన కాఫీగింజలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఒక కప్పు కాఫీ తయారు చేయడానికి 10 గ్రాముల పొడి, టీ కప్పు తయారీకి 2 గ్రాముల పొడి అవసరమౌతుంది.
ఫెయిర్ ట్రేడ్ అసోసియేషన్ ప్రకారం కాఫీ ఉత్పత్తి రంగంలో 125 మిలియను ప్రజలు, తేయాకు ఉత్పత్తి రంగంలో 14 మిలియను ప్రజలు జీవనాధారం పొందుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కాఫీ, టీల ప్రపంచ చరిత్రను గమనిస్తే తేయాకు విస్తరణ మీద బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ఉక్కు పిడికిలి ఉండటం జరిగింది. అదే కాఫీ ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆధిక్యతను చాటుకుని దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాలకు విస్తరించింది. ఈ పరిణామం క్రమేపీ జరిగింది. దీనికి రాజకీయ కుయుక్తులు స్థానిక వ్యవస్థల వినాశనం, పరిపాలన మార్పులు బహువిధాలుగా తోడ్పడినాయి. ఈ విధముగా కాఫీ, తేయాకు ఉత్పత్తి రంగాల్లో కొంతమంది బాగుపడితే మరికొందరు కోల్పోవడం జరిగింది ఆర్థికంగా..
కాఫీ, టీల అవతరణ
ప్రపంచంలో తేయాకు చరిత్ర గమనిస్తే చైనా సంస్కృతిలో తేయాకు క్రీస్తుపూర్వం 2737లోనే సాగులో నున్నట్లు ఉటంకించ బడింది. అప్పటి చైనా రాజు షెన్నాంగ్ అప్రయత్నంగా తేయాకు కలిసిన వేడి నీటిని త్రాగటం వలన తేయాకు రుచి ప్రపంచానికి తెలియ వచ్చింది. వెనుకంజ వేయలేదు అప్పటి నుండి.
కల్ది అనే ఒక ఇథియోపియా గొల్లవాడు 850 సిఇ లో తన మేకలు రానురాను హుషారుగా ఉండటం గమనించి పరిశీలిస్తే అవి కొన్ని చెట్ల ఎర్రని కాయలు తినడం దానికి కారణంగా కనుగొన్నాడు. మేకలు వాటిని తిని హుషారుగా చాలాసేపు మేల్కొని ఉండటం గమనించాడు.
ఈ విషయం ఒక ఆశ్రమ వాసులకు విన్నవిస్తే వారు ఈ ఎర్రని పండ్ల నుండి పానీయం తయారు చేసి వచ్చిన భక్తులకు ఇవ్వగా వారు దాన్ని త్రాగి ఆనందంగా హుషారుగా ఉండటం జరిగింది. ఈ విధంగా ఒక మేక వలన మనం ప్రస్తుతం త్రాగి ఆనందిస్తున్న ‘యోఖా’ లేదా ‘ఎస్ప్రెస్సోకాఫీ’ అవతరించింది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
అలా క్రమేపీ ఈ ఆహ్లాద పానీయాల తోటల సాగు ప్రపంచమంతటా విస్తరించింది. వీటి సాగుతో బాటు అనేక వాతావరణ పరిణామాలు గూడా చోటు చేసుకున్నాయి. వీటి సాగుకు విస్తారంగా అరణ్యప్రాంతాలు నరకి వేయబడినాయి, సమాజ ఆవాసాలు తొలగించబడినాయి, ప్రకృతి పర్యావరణం ముప్పునకు గురియైనది,
జంతుజాలాలకు నెలవు కోల్పోవటం లాంటి పరిణామాలు సంభవించాయి. వనాల నిర్మూలన, యాంత్రీకరణ, రసాయనికాల వినియోగం మూలంగా నీరు, గాలి, నేల కలుషితమైంది.
తేయాకు తోటలు
ఇది విశ్వ ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీసి, జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. సుమారు 17వ శతాబ్దం నాటికి యూరప్ లో ‘కాఫీ కేఫ్’లు విస్తారంగా అవతరించాయి. జమీందారీ-పెత్తందారీ వ్యవస్థ అంతరించడం మొదలైంది, వార్తాపత్రికల విస్తరణ, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది, డెమోక్రసీ వైపు అడుగులు పడి నవజాతికి నాంది పడింది.
పురాతన కాలంలో తేయాకు వాణిజ్యంలో చైనా అగ్రగామిగా ఉంది. తేయాకు చరిత్ర బ్రిటిష్ వారు భారతదేశంలో సామ్రాజ్యాన్ని విస్తరించేవరకు గోప్యంగా ఉంచబడింది. బ్రిటీష్ వారు ఇండియా, శ్రీలంక, కెన్యా దేశాల్లో తేయాకు తోటలు సాగు చేయనారంభించడం మొదలు పెట్టిన నాటి నుండి తేయాకు చిత్ర పటం మారింది. అంతకు పూర్వం బ్రిటన్ తేయాకు వాణిజ్యంలో చైనాపై ఆధారపడి ఉండేది.
18వ శతాబ్ది నాటికి వృక్షశాస్త్రవేత్తలు భారతదేశంలో కూడా తేయాకు తోటల సాగుకనువైన నేల, వాతావరణ పరిస్థితులున్నాయని కనుగొన్నారు.
కాని తేయాకు సాగుకు సాంకేతిక పరిజ్ఞానం లోపించింది. ఈ నేపథ్యంలో కొంతమంది ముసుగు సైనిక వీరులు అజ్ఞాతంగా తేయాకు విత్తనాలు, సాగు విధానాలు తెలుసుకోవడానికి చైనా వెళ్ళడం జరిగింది. చివరికి కొంతమంది వర్తక వీర సైనికులు మయన్మార్తో యుద్ధం చేసే సమయంలో అస్సాంలో తేయాకు చెట్లు పెరుగుతున్నట్లు గమనించడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ వారు అస్సాంను గెల్చుకుని తేయాకు తోటల పెంపకం విస్తారంగా చేపట్టి వాణిజ్యం జరపడం జరిగింది. బ్రిటిష్ వారు అస్సాంను ‘ఎలారేడో’ గా ఊహించుకుని బంగారం – నీలిరంగు తేయాకు గనిగా అభివర్ణించారు.
తొలుత బ్రిటిష్ వినియోగదారులు భారతదేశంలో పండించిన తేయాకు నుండి తయారు చేసిన తేనీరును అంతగా ఇష్టపడలేదు. తదనంతరం రిటైల్ వర్తకులు ఇండియా తేయాకును చైనా తేయాకుతో కలిపి విస్తృతంగా ప్రచారం చేసి వాణిజ్యం చేశారు.
ఆ విధంగా భారతీయ తేయాకు వాణిజ్యం, రంగు, రుచి, వాసనల మేళవింపుతో పలు ప్రయోగాలు జరిపింది. మనదేశంలో అస్సాంలోని ‘టొకై తేయాకు పరిశోధనా సంస్థ’ను జోర్హోట్లో నెలకొల్పడం జరిగింది. ఈ సంస్థ తేయాకు పంటకు సంబంధించిన ఉత్పత్తి, విస్తరణ, పరిశోధన, నాణ్యత మొదలైన అంశాల్లో ప్రయోగాలు జరుపుతోంది. తేయాకు వాణిజ్యం కోసం ‘భారత తేయాకు బోర్డు’ను కూడా నెలకొల్పడం జరిగింది.
బ్రిటిష్ పరిపాలనా కాలంలో చెరకు, ప్రత్తి పంటలు కరేబియన్, దక్షిణ అమెరికాలో స్థాపించిన విధంగానే మన దేశంలో కూడా తేయాకు తోటల విస్తరణకు కూడా అన్వయించారు. తొలుత ఈశాన్య భారతంలో మొదలుకుని క్రమేపీ దక్షిణ భారత దేశానికి కూడా విస్తరించడం జరిగింది.
ఈ తేయాకు తోటల పెంపకానికి విస్తారమైన భూమి, కూలీలు అవసరమైంది. కూలీలను దేశంలోని ఇతర ప్రాంతాల నుండి రవాణా చేయడం జరిగింది. తేయాకు పరిశ్రమలో శ్రామికులు కష్టతరమైన వాతావరణం, తక్కువ కూలి, ఎక్కువ పని గంటలు, కార్మిక సంఘాలు లోపించడం లాంటి అవస్థలు ఎదుర్కొనవలసి వస్తుంది.
కెఫిన్’ అనే ఉత్ప్రేరక పదార్థం
తేయాకు తోటలు స్థానికంగా సాగు చేసే ఇతర ఆహార పంటలను ఆక్రమించడం వలన ఆహార ధాన్యాల కొరత ఏర్పడేది. తేయాకు ఎగుమతుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ ఇనుమడించింది. ప్రస్తుతం తేయాకు వాణిజ్యం, వినియోగం ప్రపంచవ్యాప్తమైనది. దాని తలసరి వినియోగం మధ్యధరా సముద్ర ప్రాంతంలో అధికంగా ఉంది.
దక్షిణ అమెరికాలో దీని ఉత్పత్తి, వినియోగం ఎక్కువగా ఉంది. తేయాకులో ‘కెఫిన్’ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంది. అందువలనే దీన్ని ప్రజలు ఇష్టంగా సేవించడం పరిపాటి అయినది. ప్రపంచంలో మంచి నీటి తరువాత ప్రజలు సేవించే అధిక పానీయం తేనీరుగా తేయాకు పరిశ్రమ అతిశయోక్తిగా గొప్పగా చెప్పుకుంటోంది.
పెట్టుబడిదారీ వ్యవస్థ తేయాకు ద్వారా మనం నమ్మలేనంతగా మార్పు చెందింది. తేయాకు వాణిజ్యం అనేక కొత్త వింత పోకడలు సంతరించుకుంది. 20వ శతాబ్దం తొలి రోజుల్లో తేయాకు ఉత్పత్తిదారులు, ముఖ్యంగా ఆఫ్రికా, ఇండియా ఉత్పత్తిదారులు, ఫ్యాక్టరీలు మరియు గనుల యాజమాన్యాలతో వారి కార్మికులకు తేనీరు అందించడం వలన వారి ఉత్పాదక శక్తి మెరుగవుతుందని చెప్పి తేయాకు వాణిజ్య ఒప్పందాలు చేసుకునేవారట.
ఆవిధంగా తేయాకు ప్రాపంచీకరణ అంగళ్ళ ద్వారా, వార్తాపత్రికల్లో ప్రచురించడం ద్వారా, పెద్ద పరిశ్రమల ద్వారా జరిగింది. ఒకసారి ప్రజానీకం కెఫీన్ గల తేనీరు త్రాగడానికి అలవాటు పడిన తరువాత దానికి బానిసలుగా మారుతారు. తేయాకును చౌకగా పాఠశాలలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు పంచడం జరిగేది ఆ రోజుల్లో, ఫాషన్ మాదిరిగా కాకుండా ఆహారపుటలవాట్లు అంత సులభంగా త్వరగా మారవు. ప్రజలు రోజూ ఉదయాన సేవించే పానీయపుటలవాటు అంత తొందరగా మారదని వాణిజ్య పరిశోధకులకు తెలుసు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
అందువలనే తేనీరు ప్రజల ఆహారపుటలవాట్లలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం మే 21ను అంతర్జాతీయ తేయాకు దినంగా జరుపబడుతోంది. తేనీరులో 3000 రకాలున్నాయి. ఏ దేశంలోనైనా సైన్యంలో పనిచేసే సైనికులు దేశ రక్షణలో మరియు దేశ సంస్కృతిని విస్తరింప చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధం నాటికి భారత సైన్యానికి తేయాకు నందించడం అలవాటు చేసింది.
రెండో ప్రపంచ యుద్ధం నాటికి రవాణా సమస్యలు తలెత్తి బ్రిటన్ దేశంలో తేయాకు కొరత ఏర్పడింది. కాని అదే సమయంలో భారత దేశంలో తేయాకు లభ్యత బాగా ఉండి త్వరగా అమ్మవలసి వచ్చి స్థానిక మార్కెట్లో తేయాకు ఉత్పత్తిదారులు సైన్యానికి సరఫరా చేసేవారు.
ఆ విధంగా తేనీరు సేవనం సైనికులకు ఒక ఆయుధంగా, ఆత్మస్థైర్యానిచ్చేదిగా, యుద్ధానికి ముందు సేదతీర్చేదిగా మారింది. భారత తేయాకు పరిశ్రమదారులు ‘నడిచే తేనీరు బండ్లను’ యుద్ధ భూమిలో ప్రవేశపెట్టి తరుణిల ద్వారా భారత సైనికులకు తేనీరు అందించేవారు ఆనాడు.
జీవవైవిధ్యానికి కూడా పెనుముప్పు
ఈ తేనీరు సైనికులకు వారి కఠిన జీవితాల్లో కొంత స్వాంతననిచ్చేది. తరుణిల ద్వారా నడపబడే ఈ తేనీరు శకటాలు అనేక యుద్ధభూముల్లో సంచరించేవి. ప్రపంచ వ్యాప్తంగా ఆనాడు పంచదార, పొగాకుల మాదిరిగా తేనీరు కూడా సేవించి ఆహ్లాదం అనుభవించేవారు.
స్థానికంగా లభించే ఇతర పానీయాల కన్నా ప్రజానీకం ఇతోధికంగా తేనీరు సేవించడానికి ఇష్టపడేవారు. తేయాకు రవాణా మరియు పారిశ్రామిక ప్రాసెస్ప్ర భావాలు ఎలా ఉన్నా తేయాకు తోట విస్తారమైన సాగు వలన
భూగర్భజలాలు అంతరించి పోవడం, రసాయనికాల వలన కాలుష్యం పెరగడం పరిణమించింది.
వాతావరణ మార్పులు, ధరణి ఉష్ణోత్రల పెరుగుదల సంభవించింది. వీటి ప్రభావం ప్రస్తుతం మనం గమనించి, అనుభవిస్తున్న విషయం అందరికీ విదితమే. జీవవైవిధ్యానికి కూడా పెనుముప్పు పొంచి ఉంది… వనాల వినాశనం మూలంగా, వివిధ దేశాల్లో తేయాకు తోటలు సాగు చేయబడినప్పటికీ
(నలుపు తేయాకు హరిత తేయాకు) భారతదేశం ఎఫ్ఎఓ 2022 ప్రకారం తేయాకు ఉత్పాదన, వినియోగాల్లో అగ్రగామిగా నిలిచింది. నలుపు తేయాకు ప్రధానంగా ఇండియా, కెన్యా, చైనా, , కెన్యా, చైనా, టర్కీ, శ్రీలంకల్లో విరివిగా, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్, అర్జెంటీనా, ఉగాండా మొదలైన దేశాల్లో..
స్వల్పంగా పండించబడుతోంది. హరిత తేయాకు ప్రస్తుతం చైనాలో విరివిగాను వియత్నాం, జపాన్ మొదలైన దేశాల్లో కొంతమేర సాగు చేయబడుతోంది. ఎఫ్ఎఓ అంచనాల ప్రకారం 2030 నాటికి ఈ రెండు విధాల తేయాకు ఉత్పత్తులు భారతదేశం, చైనాల్లో అమితంగా పెరిగే అవకాశం ఉంది.
తేయాకు ఉత్పత్తిలో మనం ఆఫ్రికా దేశాల పాత్ర మరువరాదు. తేయాకు తోటల పెంపకం, ఆకు కోత అంశాల్లో కార్మికుల పాత్ర శ్రమతో గూడినది. వారికి తగు కూలి చెల్లించడం వలన వారి ఉత్పాదకత మెరుగై జీవన ప్రమాణాలు ఇనుమడిస్తాయనడంలో సందేహం లేదు.