మీడియా పై దాడులన్నీ…. వైస్సార్సీపీ ప్రభుత్వ దాడులే
ఆంధ్రజ్యోతి విలేకరి పై దాడికి నిరసనగా ఆత్మకూరు లో ఆందోళన కు దిగిన మీడియా
మంత్రి గుమ్మనూరు వ్యూహం తోనే పాత్రికేయుల పై దాడి
ధర్నా రాస్తారోకో తరలి వచ్చిన టీడీపీ, వామపక్ష ప్రజా సంఘాలు
ఆత్మకూరు :- నవ్యంధ్రప్రదేశ్ లో వైపాక ప్రభుత్వం పాత్రికేయుల పై చేస్తున్న దాడులు మితిమీరి పరాకాష్టకు చేరుకున్నాయని ప్రభుత్వనికి పొయ్యేకాలం దాపరించ్చిందని అన్నీ సంఘాలు గలమెత్తి అగ్రహించాయి నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మీడియా పెడరేషన్ ఆధ్వర్యంలో గౌడ్ సెంటర్ లో ధర్నా, నిరసన, రాస్తారోకో చేపట్టారు. కర్నూల్ జిల్లా, ఆస్పరి ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు శివ కేశవ్ పై మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు దాడి చెయ్యడాన్ని APMF కండిస్తూ ఈ కారిక్రమాన్ని చేపట్టింది. రాజకీయాలకు అతీతంగా అన్నీ పార్టీలకు, పౌరసమాజానికి సేవలు చేస్తున్న పాత్రికేయుల పై దాడులు, హత్యలు పెరిగి పోయాయాని ఇది రాష్ట్ర ప్రజాస్వామ్యానికి రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం పొంచి ఉందని APMF ప్రతినిధులు హెచ్చరించారు ఈ నిరసన లో టీడీపీ, సిపిఎం, ప్రజా, విద్యార్ధి సంఘాలు సంగిభావం తెలిపి రాస్తారోకో లో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం లో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియా పై క్షక కట్టి అణిచివేస్తుందని తెలుగు దేశం పార్టీ మీడియా హక్కులను పరిరక్షించి రక్షంచు కుంటామని తెలిపారు. సిపిఎం ప్రజా సంఘాలు స్పందించి వైసీపీ అరాచకాల పాలనపై తెగించి పోరాడి పాత్రికేయులను రక్షించుకుంటామని అన్నారు. ఈ రాస్తారోకో తో కర్నూల్ – గుంటూరు ప్రధాన రహదారి పై వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి పౌరులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
ఈ ధర్నా లో APMF ఆత్మకూరు డివిజన్ అధ్యక్షులు ఏ మగ్బుల్ బాషా, జిల్లా ప్రతినిధి ఓబులేసు, ప్రధాన కార్యదర్శి బి డేవిడ్ రాజు, ఉపాఅధ్యక్షులు నాగరాజు, కోశాధికారి సత్య పీటర్,మీడియా ప్రతినిధి మల్లిశెట్టి సుధాకర్, సభ్యులు మహేష్,రమణ, అన్వర్, APUWJ జిల్లా ప్రతినిధి సైఫుద్దీన్, టీడీపీ నాయకులు నాగూర్ ఖాన్, శివప్రసాద్ రెడ్డి, సి. కలిముల్లా, రాజారెడ్డి, కొప్పారపు రవి ప్రసాద్,అబ్దులాపురం బాషా,సుబ్బరాజు, శివారెడ్డి, సాయి దత్తు, కిరణ్, శ్రీకాంత్. మాలమహానాడు నాయకులు అబ్రహం, సిపిఎం ప్రతినిధులు రణధీర్, స్వాములు, నాయక్, సురేంద్ర, లాయర్ భాస్కర్ మరియు విద్యార్థి సంఘాలు, పట్టణ పౌరులు పాల్గొన్నారు.