మన దేశం ఎక్కువగా గ్రామీణ దేశం. ఇప్పటికి దేశంలో50 శాతం పైనే గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరు కాక దేశంలోని మరో 20శాతం మంది
ఉపాధి-ఉద్యోగం నిమిత్తం పట్టణ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకొన్నారు. అంటే ఈ 20 శాతం మందికి ఇంకా గ్రామాల్లోకి రాకపోకలు కొనసాగుతున్నాయి..
గ్రామాల్లో చాలా మంది వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు.. వ్యవసాయం ద్వారా ఇప్పటికి-ఎప్పటికి-మరెప్పటికీ
ఎంతోకొంత మంది ఉపాధి పొందుతూనే ఉంటారు.. పరిశ్రమలు, సేవల రంగం, సాంకేతికత, మెడికల్ సేవలు ఇలా ఎన్ని వచ్చినా వ్యవసాయ రంగం వ్యవసాయ రంగమే…
వ్యవసాయంలో ఆర్థిక వృద్ధిలేక ఇతర రంగాల్లోకి వెళ్లిన వారే ఎక్కువ.. వ్యవసాయంపై ఇష్టం ఉన్నా, మనుగడ సాధించలేక వ్యవసాయ రంగాన్నే వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు..
కానీ వ్యవసాయం ఇప్పుడు పరివర్తనం చెందుతోంది. గ్రామస్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార పంటలకు విలువ జోడింపు లాంటివి జరుగుతున్నాయి.
అంటే వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్ అంతా ఒకేచోట రైతుల ఆధ్వర్యంలో జరిగి మార్కెట్లోకి తరలించే ప్రక్రియ గ్రామస్తాయిలోనే జరుగుతుంది..
పెరిగిన సాంకేతికత, చదువుకున్న యువత ద్వారా వ్యవసాయం పరివర్తనం చెందుతోంది.. ఇప్పటివరకు వ్యవసాయం పూర్తిగా మార్కెట్ కి అనుసంధానం కాలేదు.
వ్యవసాయం మార్కెట్ కి అనుసంధానంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా వినియోగదారుల అభిరుచి మేరకు ప్రాసెస్ చేసి, packing చేసే ప్రక్రియ అనేది గ్రామస్థాయిలో చాలా చోట్ల ప్రారంభమైంది.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
రైతులు ద్వారా ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లు కొనసాగితే పర్లేదు. రైతుల పొలాల ద్వారా కార్పొరేట్ శక్తులు లబ్ది పొందితే ఇక రైతులు
ఆదాయాలు ఇప్పట్లో వృద్ధికాలేవు.. రైతులకు అధునాతన సాంకేతికత గురించి, విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి సమాచారం, అవగాహన,
ట్రైనింగ్ లాంటివి ఇచ్చి వాళ్ళను విలువఆధారిత ఉత్పత్తిదారులుగా, మార్కెటింగ్ చేసుకొనే అవకాశం కల్పించే ప్రణాళిక,
ప్లాట్ఫామ్స్ లాంటివి కల్పించాలి.. రైతులకు ప్రభుత్వ పథకాలు తూచా తప్పకుండా అమలుచేయాలి.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఇక రైతుల చట్టాలు విషయానికి వస్తే, రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం, రైతులకు స్థిరమైనఆదాయంవచ్చే ప్రణాళికలు లేకపోవడం లాంటి కొన్ని వాటివలన రైతులనుండి దేశ వ్యాప్తంగా నిరసన ఏర్పడింది. కొన్ని రాష్ట్రాలలో పక్క రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో పంట అమ్ముకునే వీలులేదు. దిగుబడి పెరిగితే ఏ పంట కూడా పూర్తిగా అమ్ముడుపోయే అవకాశం లేదు. అలాంటప్పుడు నిల్వ చేసుకొనే వసతులు అన్ని పంటలకు ఇంకా దేశంలో లేవు.. అంటే దేశంలో వ్యవసాయ మౌళికవసతులు ఇంకా పూర్తిగా లేవు. వ్యవసాయంలో ఎన్నో ఆటంకాలు రైతులకు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు చట్టాలు చుట్టాలుగా మారాలి.. రైతుల ఆదాయం మారితే భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం వచ్చి మరిన్ని ఉపాధి-ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి వీలవుతుంది.
-అశోక్ కుమార్ మల్లిపెద్ది